https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
లాభనష్టాలు, చావుపుట్టుకలు ఈశ్వరుని మాయలే. మరి మన కర్తవ్యం మాయలసృష్టి కర్త పరమేశ్వరుని ధ్యానించటం.
లాభ నష్టాలకు, చావు పుట్టుకలకు, జింతించినట్లు
ఇందుకు మూలం, ఈశ్వరునియొక్క మాయ కళలైనట్లే
కొబ్బరి కాయలో, నీరుపోయక నీరు వచ్చి నట్లు
శుభం అనేది, ఎవ్వరు తలవ కుండా వచ్చినట్లే
గజం తిన్న వెలగపండులో, గుజ్జు మాయ మైనట్లు
మన నుంచి పోవలసినది, విడిచి పోయి నట్లే
శ్వేత అద్దంలో నీడ స్పష్టముగా కన బడినట్లు
జీవులు ప్రేమ సందడిలో పుట్టుకలు వచ్చినట్లే
చెట్టుకు పండిన పండు తెగి నేలపై పడినట్లు
కాలము వెంబడించిన జీవులు మరణించినట్లే
రాతిపై కడవను పెట్టగా, కుదుట పడినట్లు
జీవి ఏకాగ్రతతో, మనసు కుదుట పడినట్లే
ఉదయ భానుని వెలుగుకే, మంచుకరిగి నట్లు
పరమేశ్వరుని ప్రార్ధించితే, పాపాలు పోయినట్లే
లాభ నష్టాలకు, చావు పుట్టుకలకు, జింతించినట్లు
No comments:
Post a Comment