Friday, August 16, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ
నా కష్టార్జితం అని విర్ర వీగుతున్నాను 
నిన్ను మరచి వెర్రివాడి వలె ఉన్నాను  
నీ దయ లేనిదే నేను కదలనూ లేను 
వేంకటేశా అని ప్రార్ధించడం చేయలేను  

అంతరాత్మలో ఉన్నవాని తెల్సుకోలేను  
చమత్కారముతో అహంకరిస్తూ ఉంటాను
లోకాలన్నీ ఏలే దైవాన్ని తెల్సుకోలేను   
నేనే పాలించే దొరణని ముర్సి పోతాను  

అందరికి నీవే తల్లి తండ్రివై ఉన్నను 
నాబిడ్డలకు తల్లి తండ్రి నేనే నంటాను  
సంపదలిచ్చి బ్రతుకు నేర్పిస్తున్నను 
సంపాదనంతా నాదే నని అనుకుంటాను  

భోగభాగ్యా లందించి కదలక ఉన్నను   
నేనుచేసిన తపస్సని అనుకుంటాను 
వేంకటేశా మహిమలు తెలియ కున్నాను   
కరుణించి కాపాడుతావని ఆశిస్తున్నాను.

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...