Tuesday, August 13, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీఇంట, నీవెంట, నీసందిట
నేనున్నప్పుడు, అసంకిల్పితంగా ఎప్పుడైనా ఎదురాడినానా ప్రభూ?

నీచెంత ఏచింత లేకుండా ఉంటూ
అనాలోచితంగా నోరుజారి
కానిమాట ఏదైనా  అన్నానా ప్రభూ?

నీలాలనలో మేను మరచి నిద్రించిన నేను
నా కలవరింతలలో నిన్ను కలతపరచే కఠినమైన మాట ఏదైనా అన్నానా ప్రభూ?

నీకోసం సాగిన నా వెతుకులాటలో
నా సరసన నిన్ను గానక నిరసనతో
ఏదైనా కరకుమాట నేనన్నానా ప్రభూ?

నా ఆలోచనలు నాలోని నిన్ను ఏమార్చ
నన్ను నేనుగా పైకెత్తుకోని - నిన్ను
కించపరచే మాట నోట జార్చానా ప్రభూ?

తెలియక, తెలివిలేక, తొందరతనంతో
నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా ప్రభూ?
మందమతినై నేనన్న మాటను మన్నించలేవా ప్రభూ?
నీకు దూరంగా ఇన్ని సంవత్సరాల శిక్ష భరించాను
కాని మాటకు పరిహారం కాలేదా ప్రభూ?
అయిందా? నన్ను చేర్చుకో ..
లేదా నాతో ఉండు.

శివ నీ దయ.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...