Monday, October 21, 2024

 దేదీప్యమానమైన

దివ్య ప్రకాశాన్ని
దేహీభూతమైన
దేహం దర్శిస్తూనే ఉంటుంది ...
అందుకే
అది దగ్ధం అవుతూ
దహింపబడుతూ ఉంటుంది ...
శివోహం శివోహం

"నేను" కాలితేనే
"తాను" కనిపిస్తాడు
"నేను" కు "మేనులు"
దొరికితే దహనాలు తప్పవు
దహనాల దేహాలలో సందేహాలు
దహనం అయ్యే కొలదీ తేజం
దేదీప్యమానంగా వెలుగొంది
ఆదిదేవుడు పరమశివుని ఒడిని
చేరు తీరు దగ్గర అవుతోంది
పరమేశ్వరా! నీ దయ ఎట్లున్నది
నా నేను ల మేనులు ఏకమై నిను
చేరే దారి చూపరాదా! పరమేశ్వరా
ఓం శివాయ నమః శివాయై నమః

శివప్పా
నీ కైలాసం చేరాలంటే ...
అశ్వమేధ
యాగాలను చేయలా ...
అశ్రు నయనాల
ఆరాధనలు చేయలా ...
తెలియచేయి తండ్రీ
తాత్పర్యం తిరిగేసి వ్రాయి మహాదేవ ...
శివోహం శివోహం

"పరి" త్యాగం నేను చేయగలనా?
పరమేశ్వరా! కైలాసం చేరేందుకు

సాధన
తండ్రి శివప్ప
నైవేద్యం వంటిది ...
అందులోని
రుచి అందుకోవాలంటే
కఠోర శ్రమ చేయవలసినదే ...
శివోహం శివోహం

ఊపిరి ఊయలలో
అటుపోటులు తప్పవు
తెలిసి చేసిన తెలియక చేసినా
ఏ జన్మలో కర్మనో
ఈ జన్మలో అనుభవిస్తున్నా
అంటూనే! మరుజన్మకు
మంచి పునాది వేసే దారి
వెదకకుండా! నింద దైవం
పై వేసి, నిష్టూరం ఆడకుండా
కర్మ ఫలాలను అనుభవించి
పాప క్షయం చేసుకుని నూతన
జీవిత సోపానాలు వేసుకునే
దారి చూపించు దక్షిణామూర్తి
ఓం శివాయ నమః శివాయై నమః

నీ నామ గానమే సుమధురం
పరమేశ్వరా! నీ వదనమే ఆనంద
మందారం మల్లికార్జునా!
గంధ పుష్పాక్షతలను సమర్పించే వేళ
నా మనసు నీపై లగ్నం అయితే అదే చాలు
ఆ వాసనలు మాయమై! పరవశ పరిమళాలు
వెదజల్లేను విరూపాక్షా! ఈశ్వరా
ఓం శివాయ నమః శివాయై నమః

శివప్పా
ఈ దేహానికి
బయటా దుర్గంధమే
లోపలా దుర్గంధమే ...
ఎక్కడ
ఉన్నాయి తండ్రీ ...
నీదైన భస్మ
సుగంధ సుపరిమలాల సౌరభాలు ...
మేనును తాకనే లేదు
మది పులకరించనే లేదు ...
శివోహం శివోహం

ఈశ్వరా!
ఈ లోకం తీరు ఊరు దాటిన
కాటిలో కూడా కనబడుతుంది
జీవితం ఉన్నన్నాళ్ళు కానని
బంధువులు బంధాలు మిగిలిన
రూకల నూకలు గురించి తగవులాడి
చివరి ప్రయాణం కూడా ప్రశాంతత
లేని తీరుగ కట్టెకు కాటికి కూడా
ధర కట్టి కలియుగంలో ధర్మం లేదని
ఋజువులు చేస్తున్న రోజులివి శంకరా
చివరి క్షణాల వేదనలో నీవే తోడుగా
నిలిచి జీవాత్మకు ప్రశాంతత కలిగించే
పని చాలా మిగిలిపోతుంది సర్వేశ్వరా
ఓం శివాయ నమః శివాయై నమః

తండ్రీ
నీవే కదా ...
జననమైనా జ్ఞానమైనా
దేహమైనా ధ్యానమైనా ...
కష్టమైనా కాష్టమైనా
భిక్షమైనా భస్మమైనా ...
మంత్రమైనా మౌనమైనా
మరణమైనా మోక్షమైనా ...
శివోహం శివోహం


No comments:

Post a Comment

మహాదేవా శంభో శరణు.

  శివ! ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి... మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె... మలినాలతో మనసు ముసురుకొని వున్నాది... ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి న...