Saturday, October 19, 2024

 శివా!విశ్వమంత వెలుగులొ నీవు కానరావు

అంతరాన చీకటిలో సాగకుంది నా పయనం
గమ్యం చేరనీ గమనాన నీవే తోడుగా
మహేశా . . . . . శరణు.

వెలుగువో
నా ముందు
వెలిగే ప్రమిదవో ..
శివ ఓం

ఉన్నదంతా చీకటే
నాకు కనిపించే వెలుగు
నీవే కదా పరమేశ్వరా
ఓం శివాయ నమః శివాయై నమః

అమ్మ అన్న పిలుపు లో
అమృతం దాచావు తల్లీ
ఆ పిలుపులో
మాధుర్యం అనుభవించిన
వారికే తెలుస్తుంది
ఆ కన్నుల్లో
కరుణకు అంతము లేదు
నీ వాత్సల్యంలో
ఆదరణకు అవధులు లేవు
నీ ప్రేమలో
దయకు పరిధులు లేవు
జన్మ జన్మల
నీ సేవ చేసే
మహా భాగ్యాన్ని
ప్రసాదించు తల్లీ

ఎందుకు కన్నయ్యా
నాపై అంత చిన్న చూపు
ఆ లేగ దూడకు
ఉన్న స్వచ్చ.మైన
మనసు ప్రేమ
నాకు లేదనేగా
ఆ పశువుకు ఉన్న
సేవా భావం
సమర్పణా
నాకు రావనేగా
ఆ జీవికి ఉన్న
ఏకగ్రత సాత్వికత. నాలో ఉండవనేగా
మలచుకో మాధవా
ఆ లేగ దూడ కన్నా
ఎక్కువగా నీతోనే ఉంటాను
నీ సేవలే చేస్తాను
నీ పదములే నమ్ముతాను

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...