Thursday, October 17, 2024

 కట్టెను

కాటిని
వెలకట్టి అమ్మేటి ...
ఈ లోకంతోనే
నీకు నీవుగా మహాదేవునిగా
" చాలా పని ఉంది తండ్రీ " ...
శివోహం శివోహం

ఈశ్వరా!
ఈ లోకం తీరు ఊరు దాటిన
కాటిలో కూడా కనబడుతుంది
జీవితం ఉన్నన్నాళ్ళు కానని
బంధువులు బంధాలు మిగిలిన
రూకల నూకలు గురించి తగవులాడి
చివరి ప్రయాణం కూడా ప్రశాంతత
లేని తీరుగ కట్టెకు కాటికి కూడా
ధర కట్టి కలియుగంలో ధర్మం లేదని
ఋజువులు చేస్తున్న రోజులివి శంకరా
చివరి క్షణాల వేదనలో నీవే తోడుగా
నిలిచి జీవాత్మకు ప్రశాంతత కలిగించే
పని చాలా మిగిలిపోతుంది సర్వేశ్వరా

తండ్రీ
నీవే కదా ...
జననమైనా జ్ఞానమైనా
దేహమైనా ధ్యానమైనా ...
కష్టమైనా కాష్టమైనా
భిక్షమైనా భస్మమైనా ...
మంత్రమైనా మౌనమైనా
మరణమైనా మోక్షమైనా ...
శివోహం శివోహం

నేనైనా నువ్వైనా
నీవే కదా ఈశ్వరా
అయినా జీవునిగా
ఆరాటం నిత్య పోరాటం
నిను ఆరాధించడం మినహా
ఏమీ చేయలేను, అన్నీ నీవే
అయి నిలబడు పరమేశ్వరా
ఓం నమః శివాయ శివాయై నమః

నీదైన
జీవిత పయనంలో ...
నీకు తెలిసినది
గొప్పదే కావచ్చు ...
కానీ .....
నీకు తెలియనిది
ఇంకా చాలా చాలా గొప్పది ...
శివోహం శివోహం

శివప్పా
నీ స్నిగ్ధ సౌందర్య
సమ్మోహన రూపానికి ...
నాలో
నేను వివశున్ని ...
నాలో
నేను విరాగిని తండ్రీ ...
శివోహం శివోహం

నిన్ను
నీవు ప్రశ్నించుకోలేకపోతే
నీలో
నీవు తొంగి చూసుకోలేకపోతే ...
లోన ఉన్న
ఆ మహాదేవుడు మాత్రం
ఏమి చేయగలడు
కర్మాణుసారం వదిలేస్తాడు అంతే ...
శివోహం శివోహం

శివుని యందు ఉన్న
అచంచలమైన ఆత్మ విశ్వాసానికి ...
ఏ విధమైన సడలింపులు
సవరణలు ఉండనే ఉండకూడదు ...
శివోహం శివోహం

తండ్రీ
శివప్పా
నిరీక్షిస్తూనే ఉంటాను
చివరి క్షణం వరకు
నీవు కనిపిస్తావేమోనని ...
ప్రార్థిస్తూనే ఉంటాను
తుది ఘడియ వరకు
నీవు పలకరిస్తావేమోనని ...
శివోహం శివోహం

శివప్పా
నీ గురించిన
కొన్ని భావాలు ...
మాటల్లో కన్నా
మౌనంగానే బాగుంటాయి ...
ఏ కన్నీటి ధారలగానో
ఏ ఆనంద భాష్పాలగానో తండ్రీ ...
శివోహం శివోహం

శివప్పా
నీ రుద్రం
నా హృదయ సాగరంలో
ఎగిసిపడే అలలా ఉంటుంది ...
నీ నమకం
నా నుదుటిపై విభూదిలా
నమ్మకంగా నిలుస్తూ ఉంటుంది ...
నీ చమకం
నా చితిమంటల కడదాకా
చేరువుగా వస్తూనే ఉంటుంది ...
నీ మహాన్యాసం
నా ముగింపు వేడుకలలో
మవునంగా నిలిచి ఉంటుంది తండ్రీ ...
శివోహం శివోహం

తెలుసు
నివసిస్తున్నది
మాయా ప్రపంచంలోనని ...
అందుకే
జీవిస్తున్నా
నీ సత్య నిజలోకంలో తండ్రీ ...
శివోహం శివోహం

శివప్పా
ఏ పెద్ద జ్ఞానమో వద్దు ...
నిన్ను తెలుసుకునే
ఎరుక చాలు తండ్రీ ...
శివోహం శివోహం

శివప్పా
మది నిండా నీ రూపమే
హృది నిండా నీ ధ్యానమే ...
తనువంతా నీ తత్వమే
ఇక నేననే నా ఉనికి ఎక్కడ తండ్రీ ...
" అంతా శివమయమే "
శివోహం శివోహం

లోపల ఉన్న
వ్యవస్థలు అన్నీ
ఏ లోపాలు లేకుండా ...
నిరంతరంగా
నిరాఘాటంగా
నడయాడుతూ నర్తిస్తున్నాయంటే ...
నిటలాక్షుని
దయా దాక్షిణ్యాల
మహా ప్రసాదమని మరచిపోకు ...
శివోహం శివోహం

కైలాసం అంటే
ఎక్కడో ఉండదు ...
శివుని ముందు
నీవు కూర్చున్న చోటే కనిపిస్తుంది ...
శివోహం శివోహం

శివప్పా
నిన్ను
కరిగించి కదిలించే
కన్నీటి కృతులను రాయలేను ...
నీవే
నీ కైలాసాన్ని కాదనుకుని
నా కోసం కదలి రావయ్యా తండ్రీ ...
శివోహం శివోహం


No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...