Sunday, November 3, 2024

మహాదేవా శంభో శరణు.

 శివయ్యా

నన్ను పశువుగా
మార్చినా
అమితానందమే
నీ చేయి
నా తలపై
ఉంచితే చాలు
శివయ్యా నీవే దిక్కయ్యా

అపుడు
ఇపుడు
ఎప్పుడూ
ఒకేలా ఉండే నిన్ను కాక
మరెవ్వరిని నమ్మెద శివయ్యా
నీవు కాక మరి
తోడూ నీడా అండా దండా
ఎవరయ్యా శివయ్యా ?

పుట్టినపుడు
జీవుడు ఎందుకు ఏడుస్తాడో
అర్ధం అయింది శివయ్యా
నిన్ను వీడి
మాయా ప్రపంచంలో
అడుగు పెట్టటం
ఎంత దుఃఖ కారణం ?
అలాంటిది
ఈ మాయా ప్రపంచాన్నివీడి
నీ చెంతకు చేరటానికి దుఃఖమెందుకు ?
అమితానందం కలుగక
ఎన్ని జన్మలు ఎత్తిననేమి ?
ఎన్ని పదవులు భోగములు పొందిన నేమి ?
ఎన్ని సుఖములు సంతోషములు
అనుభవించిన నేమి ?
నీ పద రేణువుగా
నీ గణములలో కింకరునిగా నిలువుటకన్నా
భాగ్యమేది, సౌభాగ్యమేది
సదా శివా
చీకటినుంచి
నను వెలుగు (నీ) వైపు నడిపించు
మహాదేవా
శరణు శరణు శరణు

తండ్రీ
కొందరు ఉన్నతమైన
తెలివి కలిగిన
జ్ఞానవంతులైన బిడ్డలు
అలాంటి వారినే చేరదీస్తావా?
అజ్ఞానముతో
అల్ప జ్ఞానముతో
అంధకారములో ఉన్న
నా సంగతి ఏమిటి?
నాపైనే ఎక్కువ
శ్రద్ద పెట్టాలి కదా
నాతోనే ఎక్కువ
సమయం గడపాలి కదా
నన్నే ఎక్కువ ఆదరించిఉన్నత స్థితికి
తీసుకు రావాలిగా
శివయ్యా నీవే దిక్కయ్యా

అయ్యప్ప తండ్రి! ఎన్ని కన్నీటి వర్షాలు కురిసిన... గుండె మంటలారాటం లేదు... నా మనసులో మాట చెవిని పెట్టు నీ ఆట కాస్త విడిచి పెట్టు నన్ను ఉద్ధరించగ దృష్టి పెట్టు.
హరిహర పుత్ర అయ్యప్ప శరణు.

సదాశివ!
తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పించు కోలేని తరుణంలో చేసితిని తప్పులు...
తప్పు చేసినట్లు విన్నవించు చున్న...
తప్పు క్షమించి నన్ను కాపాడు సదాశివ.
మహాదేవా శంభో శరణు.
శివ నీ దయ.

కాలం ఎన్నెన్నో గాయాలను చేస్తూ ఉంటుంది.
ఎందుకంటే...
గడియారంలో పూలు ఉండవు, అక్కడ ఉండేవి ముళ్ళే కదా.
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
ఓం శ్రీమాత్రే నమః

నా సృష్టి దైవ నిర్ణయం
నా జీవిత కరుణా మయం
నా ప్రేమ అనురాగ మయం
నా హృదయ్యం చైతన్య భరితం
ఓం నమః శివాయ

ఒప్పుకున్నాను
దినములో ఎప్పుడో
గుర్తొచ్చినప్పుడే
నీకు నమస్కరిస్తున్నాను
ఒప్పుకున్నాను
పూజలు
సేవలు కూడా
సంపూర్ణమైన
సమర్పణా భావముతో
చేయలేక పోతున్నాను
ఒప్పుకున్నాను
రేపు నాది కాదు
అని తెలిసి కూడా
అవివేకముతో
బంధాలకోసం
అనుబందాలకోసం
వెంపర్లాడు తున్నాను
ఒప్పుకున్నాను తండ్రీ
అన్నీ నా పొరపాట్లే
భక్తితో నేను పిలిస్తే
నీవు పలుకను అన్నావా
ఆర్తితో నిన్ను వేడితే
చేరతీయను అన్నావా
మన్నించు
కన్నీటి ధార
ఆగటం లేదు
శివయ్యా నీవే దిక్కయ్యా

శివ!
కాటిలో నివాసమున్నా...
నీవు దేవదేవుడీవే...
పులి తోలు కట్టుకున్నా...
పాములనూ , పుర్రె మాలనూ మెడలో ధరించినా నీవు దేవతాసార్వభౌముడీవే...
దేహీ యని బిక్షమెత్తినా...
ఏడేడు భువనాలనేలుతూ...
ఎద్దు మీదే తిరిగినా...
ఎలా వున్నా...
నీకే చెల్లిందీ...
ఏదీ చేసినా...
నీకే చెల్లుతుందీ తండ్రి కానీ ఒకటే కోరిక ఈ పుర్రె నీ కూడా నీ మెడలో వేసుకొని కైలాస వాసుడవనిపించు తండ్రి.
మహాదేవా శంభో శరణు.


No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...