Sunday, November 3, 2024

శివోహం శివోహం

 శివా!నీ గుడిలో దీపంగా నన్ను వెలగనీ

నా గుండెల్లో దీపంగా నిన్ను తెలియనీ
ఆ వెలుగు బాటలో నే గమ్యం చేరనీ
మహేశా .....శరణు.

శివా!నీ తలను తాకిన గంగకు
పాప ప్రక్షాలన శక్తి నొసగేవు
నీ పదమంటిన నాకు పేరెందుకు .
మహేశా . . . . . శరణు

శివా!అంగాలు లేకున్న లింగాన నిను తెలిసి
పూజించి మురిసాను అనునిత్యం
ఎఱిగించ తలచాను ఈ సత్యం
మహేశా . . . . . శరణు .

శివా!నీ తలను తాకిన గంగకు
పాప ప్రక్షాలన శక్తి నొసగేవు
నీ పదమంటిన నాకు పేరెందుకు .
మహేశా . . . . . శరణు .

మనసు ఉంది
మంత్రం ఉంది
గుండె ఉంది
గురుతు ఉంది ...
ధ్యానం ఉంది
ధ్యేయం ఉంది
బంధం ఉంది
భస్మం ఉంది ...
నను విడిచే దేహం ఉంది
నిను చేరే ప్రాణం ఉంది
ఇంతకు మించి
ఇంకేమి కావాలి తండ్రీ నీకు ...
శివోహం శివోహం

తండ్రీ
ఏమో పూజలు
ఏవో జపాలు
ఏవో యాగాలు
ఏవో యజ్ఞాలు
ఏమీ తెలియవు
నియమ నిష్ఠలు
అంతకన్నా లేవు
అన్ని విధాలా
ఆశక్తుడిని
నిన్నే నమ్మి ఉన్నాను
బ్రోచు భారము నీదే
శివయ్యా నీవే దిక్కయ్యా

నీవు మాత్రమే
పొందే
అనంతమైన
అనందంలో
అనువైనను
నాకు ప్రసాదించు
నీ ఎదపై
సేదతీరి
నీకు
సేవ చేస్తూ
ఊపిరి ఊపిరికి
నీ రచన తెలుసుకునే
జ్ఞానాన్ని
అస్వాదిస్తూ
అనందించే మహా యోగం
కలిగించు

మనుషుల ప్రేమను
పొందాలంటేనే
మళ్ళీ మళ్ళీ
జన్మలు ఎత్తాలి
మహాదేవుని ప్రేమనే
పొందాలంటే
ఆర్తి
తపన
భక్తితో
చివరి క్షణాలు కలిగిన
మరణం ఒక్కటి చాలు

జననం
మరణం
రెండు వద్దు
నువ్వు లేని
క్షణాన
వెలుగు
చీకటి
రెండు వద్దు
నీ మాట వినని
క్షణాన
సుఖము
దుఃఖము
రెండు వద్దు
నీ చెంతన
లేని క్షణాన

ఒక్కోసారి
ఇష్టం అనుకున్న
బంధాలే
కష్టంగా భావిస్తారు
మన అనుకున్న
అనుబంధాలే
పరాయి గా మారతాయి
ప్రాణంలా ఉన్న
ప్రేమలే
కనుమరుగవుతాయి
ప్రతీ క్షణమూ ముల్లులా
మనసుని గుచ్చుతూనే
ఉంటాయి మాటలు
ప్రతీ దినం కాలుస్తూనే
ఉంటాయి జ్ఞాపకాలు
మానవత్వానికి
చిరునామా
మళ్ళీ వెతకాలి
సున్నిత మనసులకు
అలాంటివి తీరని శాపం

అమ్మ అన్న పిలుపు లో
అమృతం దాచావు తల్లీ
ఆ పిలుపులో
మాధుర్యం అనుభవించిన
వారికే తెలుస్తుంది
ఆ కన్నుల్లో
కరుణకు అంతము లేదు
నీ వాత్సల్యంలో
ఆదరణకు అవధులు లేవు
నీ ప్రేమలో
దయకు పరిధులు లేవు
జన్మ జన్మల
నీ సేవ చేసే
మహా భాగ్యాన్ని
ప్రసాదించు తల్లీ

ఎందుకు కన్నయ్యా
నాపై అంత చిన్న చూపు
ఆ లేగ దూడకు
ఉన్న స్వచ్చ.మైన
మనసు ప్రేమ
నాకు లేదనేగా
ఆ పశువుకు ఉన్న
సేవా భావం
సమర్పణా
నాకు రావనేగా
ఆ జీవికి ఉన్న
ఏకగ్రత సాత్వికత. నాలో ఉండవనేగా
మలచుకో మాధవా
ఆ లేగ దూడ కన్నా
ఎక్కువగా నీతోనే ఉంటాను
నీ సేవలే చేస్తాను
నీ పదములే నమ్ముతాను


No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...