Tuesday, November 5, 2024

మహేశా .....శరణు.

 ఎవరు తండ్రీ

నిన్ను చూడటానికి
భయపడేది
గుండెల నిండుగా
మాపై ప్రేమను పెంచుకొని
మాకోసం గుండెలో
కొలువై
ఇంతలా చిరునవ్వుతో
ప్రేమగా కనిపిస్తుంటే
ఎవరు తండ్రీ
నీకు బంధాలు
అనుబంధాలు తెలియవని
తృటిలో తెంచేస్తావని అనేది
అమ్మకి అర్ధభాగం
ఇచ్చి ఆలు మగల
అన్యోన్యతకు అర్ధం
ఇస్తే..
ఎవరు తండ్రీ
నీకు ఇల్లు వాకిలి
లేక స్మశానంలో
బైరాగిగా ఉంటావని
గుస గుస లాడేది
ప్రేమాన్వితమైన కుటుంబాన్ని
అతి సీతలమైన
హిమ పర్వతాన్ని ఒదిలి
కట్టెలపై కాలే
ఈ కట్టేపై
ప్రేమను పెంచుకొని
ఒంటరిగా విలపించే
ఈ జీవుని
ఒడి చేర్చి
అలించి లాలించే
వాత్సల్యం చూపుతుంటే
తెలిసి తెలియక
నిన్ను మరచిన
కాలాన్ని తొలగించి
నిన్ను తలచిన
క్షణాలనే గుర్తించి
ఆదరించి
చేరదీసే నీకన్నా
ఎవ్వరు మిన్న మల్లన్నా??
శివయ్యా నీవే దిక్కయ్యా


ఎవరు తండ్రీ

నిన్ను చూడటానికి
భయపడేది
గుండెల నిండుగా
మాపై ప్రేమను పెంచుకొని
మాకోసం గుండెలో
కొలువై
ఇంతలా చిరునవ్వుతో
ప్రేమగా కనిపిస్తుంటే
ఎవరు తండ్రీ
నీకు బంధాలు
అనుబంధాలు తెలియవని
తృటిలో తెంచేస్తావని అనేది
అమ్మకి అర్ధభాగం
ఇచ్చి ఆలు మగల
అన్యోన్యతకు అర్ధం
ఇస్తే..
ఎవరు తండ్రీ
నీకు ఇల్లు వాకిలి
లేక స్మశానంలో
బైరాగిగా ఉంటావని
గుస గుస లాడేది
ప్రేమాన్వితమైన కుటుంబాన్ని
అతి సీతలమైన
హిమ పర్వతాన్ని ఒదిలి
కట్టెలపై కాలే
ఈ కట్టేపై
ప్రేమను పెంచుకొని
ఒంటరిగా విలపించే
ఈ జీవుని
ఒడి చేర్చి
అలించి లాలించే
వాత్సల్యం చూపుతుంటే
తెలిసి తెలియక
నిన్ను మరచిన
కాలాన్ని తొలగించి
నిన్ను తలచిన
క్షణాలనే గుర్తించి
ఆదరించి
చేరదీసే నీకన్నా
ఎవ్వరు మిన్న మల్లన్నా??
శివయ్యా నీవే దిక్కయ్యా

శివ!
ఎప్పుడూ బాధలతోనే నీ భక్తులు
అభిషేకం చేయాలా తండ్రి...
అప్పుడప్పుడు సంతోషం తో కూడా అభిషేకం చేసే అవకాశం ఇవ్వవయ్యా
సర్వం నీవే సర్వస్వం నీవే అని నిన్నే నమ్మి తలచి కొలచి
సేవలు చేసే మాకు
అన్యమేరగని మాకు నీవు కాక ఎవరు బాగోగులు చూస్తారు తండ్రి.
మహాదేవా శంభో శరణు.

తండ్రీ
ఆనంద తాండవం అంటే
ఇదేనా?
ఇంతటి అనందము
నీకు మాత్రమే ఎప్పుడు
సొంతమా?
నీ బిడ్డలు అనేకములైన
ఉపాధులలో
మోయలేని భారాన్ని
ఓపలేని బాధను
అనుభవిస్తూ
జీవచ్చవాలులా
బతుకును భారంగా
ఈడుస్తున్నారని తెలుసా?
నిన్ను నమ్ముకొని
నీవే దిక్కని కొలిచే వారు
కూడా
అష్ట కష్టాలు
అంతులేని ఆవేదనలతో
జీవితం సాగిస్తున్నారని
తెలుసా?
ఉపాధులు ఒదిలాక నైనా
నీ అనందంలో మాకునూ
కొంచెం అందేలా
అనుగ్రహించు
నీ పాదముల చెంత
నిలిచి
నీ ప్రేమను
నీ దయను
పొందే
మహా భాగ్యాన్ని కలుగచేయి
మహాదేవా 🙏🏻
శివయ్యా నీవే దిక్కయ్యా

శివయ్యా
నీకోసం
కఠోరమైన తపము చేసి తలలు
ఇచ్చి మెప్పించిన వారు ఉన్నారు
మూఢ మైన భక్తితో
తన నేత్రాలను కూడా నీకు
ఇచ్చి నీ కరుణకు
పాత్రులైన వారు ఉన్నారు
నిరంతర నీ నామ స్మరణతో
దేహాభిమానాన్ని వదిలి
జీవితాన్ని నీకు అంకితం చేసి
నీ దయను పొందిన
మహాభక్తులు ఉన్నారు
నీవు తప్ప జగమున మారేది లేదని
ఊపిరి ఉన్నంత వరకూ
నిన్నే తలచి
నిన్నే కొలచే
పరమ భక్తులు ఉన్నారు
నాకేమి తండ్రీ
భావబంధాలలో ఉంచి
మాయా మొహాల ముంచి
కామక్రోధాల నిలిపి
నిన్ను తలచే
నిన్ను కొలచే
నిన్ను సేవించే మార్గం కఠినం చేసావు
ఎవరో అనగా విన్నాను
నీవు ఆర్తితో జనించిన కన్నీటికి
కారుగుతావని
భక్తితో తన్మయత్వంతో పిలిస్తే
పలుకుతావని
మరువక నీ సేవను చేస్తే
మురుసిపోతావని
నన్ను ఆ విధంగా అనుగ్రహించు
నీ కింకరునిగా స్వీకరించు
శివయ్యా నీవే దిక్కయ్యా


శివశక్తి
శివుడే శక్తి
చూసేవారికి రెండు
తెలుసుకున్న వారికి ఒకటి
ఓం నమఃశివాయ శివాయై నమః
ఒకటే మంత్రం కానీ రెండుగా అనిపిస్తుంది.
ఓం శివోహం...సర్వం శివమయం.

శివా ! ఈశ్వర కాలంలో నీ పూజ మొదలైంది
పంచారామాలు మెదలి పంచోపచారాలైంది
జ్యోతిర్లింగాలు కదలి నాలో జ్యోతి లింగమై వెలిగింది
నీ దయ ప్రసాదం అయింది. నేనే శివుడనిపించింది
శివా ! నీ దయ

శివ
నా అండదండలుగా నీవుండగ
నాగుండె పలకరాయిగా మారి నిత్యం నీ నామం పలుకుతుంది...
నా తిరుగుడుకు తిరగలి మంత్రం ఒక్కటే ఓం నమః శివాయ.
నీ ఎరుకలో ఏమరుపాటు లేకుండా కాపాడు, నీ రాకపోకల
గమనం గుండె గోడల్లో గుర్తు చేయి సర్వేశ్వరా.
మహాదేవా శంభో శరణు.

శివా! నీవు లేక నేను లేను
నీవు కాని నేను కాను
మనది అమర కథ
చేరదు అది కంచి కదా!
శివా నీ దయ!

శివా!అసమానతలన్ని ఆవిరైపోగా
భేదములన్ని బూడిదైపోగా
చేర వచ్చేవ నీలోన చేర్చుకొనగ
మహేశా . . . . . శరణు .

ఎందరో పుణ్యాత్ముల కోసం
నీవు మారుభూమిలో
ఉన్నావు మహాదేవా
కాలికి చెప్పులు లేక
చీని చీనంబరములు లేక
సువర్ణఆభరణాలు ధరించక
కేవలం
నిన్ను నమ్మి ఉపాధులు
ఒదిలిన వారికోసం
నా కోసం అలానే ఉండు
ఆ మాత్రం ఆగలేవా?
ఎన్ని ఉపాధులలో
చరిస్తూ
నీ కోసం పరితపించానో
తెలుసా
ఎన్ని అజ్ఞానపు బతుకులలో
నీ కోసం అలమటించానో
ఎరుకా
ఎన్ని జన్మలు నీవు
తెలియక వ్యర్థముగా
బతికానో తెలుసా
నాకోసం అలానే ఉండు
నీ పదములు పట్టి
విడువను ఎన్నడూ
శివయ్యా నీవే దిక్కయ్యా

నీలా ప్రేమను
పంచేవారు
నీలా కామమును
జయించినవారు
నీలా నిరాడంబరముగా
జీవించేవారు
నీలా నిత్య సంతుష్టులు
నీలా యోగసాధకులు
కర్మనిష్టులు
నీలో నిలచెదరు కదా..
శివయ్యా నీవే దిక్కయ్యా

శివయ్యా
నన్ను పశువుగా
మార్చినా
అమితానందమే
నీ చేయి
నా తలపై
ఉంచితే చాలు
శివయ్యా నీవే దిక్కయ్యా

అపుడు
ఇపుడు
ఎప్పుడూ
ఒకేలా ఉండే నిన్ను కాక
మరెవ్వరిని నమ్మెద శివయ్యా
నీవు కాక మరి
తోడూ నీడా అండా దండా
ఎవరయ్యా శివయ్యా ?

పుట్టినపుడు
జీవుడు ఎందుకు ఏడుస్తాడో
అర్ధం అయింది శివయ్యా
నిన్ను వీడి
మాయా ప్రపంచంలో
అడుగు పెట్టటం
ఎంత దుఃఖ కారణం ?
అలాంటిది
ఈ మాయా ప్రపంచాన్నివీడి
నీ చెంతకు చేరటానికి దుఃఖమెందుకు ?
అమితానందం కలుగక
ఎన్ని జన్మలు ఎత్తిననేమి ?
ఎన్ని పదవులు భోగములు పొందిన నేమి ?
ఎన్ని సుఖములు సంతోషములు
అనుభవించిన నేమి ?
నీ పద రేణువుగా
నీ గణములలో కింకరునిగా నిలువుటకన్నా
భాగ్యమేది, సౌభాగ్యమేది
సదా శివా
చీకటినుంచి
నను వెలుగు (నీ) వైపు నడిపించు
మహాదేవా
శరణు శరణు శరణు

తండ్రీ
కొందరు ఉన్నతమైన
తెలివి కలిగిన
జ్ఞానవంతులైన బిడ్డలు
అలాంటి వారినే చేరదీస్తావా?
అజ్ఞానముతో
అల్ప జ్ఞానముతో
అంధకారములో ఉన్న
నా సంగతి ఏమిటి?
నాపైనే ఎక్కువ
శ్రద్ద పెట్టాలి కదా
నాతోనే ఎక్కువ
సమయం గడపాలి కదా
నన్నే ఎక్కువ ఆదరించిఉన్నత స్థితికి
తీసుకు రావాలిగా
శివయ్యా నీవే దిక్కయ్యా

సదాశివ!
తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పించు కోలేని తరుణంలో చేసితిని తప్పులు...
తప్పు చేసినట్లు విన్నవించు చున్న...
తప్పు క్షమించి నన్ను కాపాడు సదాశివ.
మహాదేవా శంభో శరణు.
శివ నీ దయ.

శివా!మంత్రమునో తంత్రమునో తెలియదు
మనన స్మరణములు లేక మనలేకున్నాను
మర్మము ఎరిగించు తెలిసేలా మనసే నీవుగా
మహేశా . . . . . శరణు .

శివా!నీ గుడిలో దీపంగా నన్ను వెలగనీ
నా గుండెల్లో దీపంగా నిన్ను తెలియనీ
ఆ వెలుగు బాటలో నే గమ్యం చేరనీ
మహేశా .....శరణు.

శివా!అంగాలు లేకున్న లింగాన నిను తెలిసి
పూజించి మురిసాను అనునిత్యం
ఎఱిగించ తలచాను ఈ సత్యం
మహేశా . . . . . శరణు .

శివా!నీ తలను తాకిన గంగకు
పాప ప్రక్షాలన శక్తి నొసగేవు
నీ పదమంటిన నాకు పేరెందుకు .
మహేశా . . . . . శరణు

శివా!నీ తలను తాకిన గంగకు
పాప ప్రక్షాలన శక్తి నొసగేవు
నీ పదమంటిన నాకు పేరెందుకు .
మహేశా . . . . . శరణు




No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...