Tuesday, November 12, 2024

మహాదేవ శంభో శరణు.

తండ్రీ
ఎలుగెత్తి పిలిస్తే
పలుకక పోవచ్చు
వివిధములైన సేవలు చేస్తే
సంత సించక పోవచ్చు
ఖరీదైన సంబారాలు ఇస్తే
ఇష్టం రాక పోవచ్చు
ఆర్తితో జనించిన కన్నీరు
సమర్పిస్తే కదలి రాక
ఉండలేవు కదా

శివ!
లోక మొక రంగస్థలి,...
మేము నిన్ను తలచి చలించే దాసులం...
మా మనసు ఒక చక్రస్థలి...
మేము నీ కృప పాత్రులం...
ఏలిక నీవయ్య...
ఆలోచన కూడిక నీ తొనయ్యా...
మాతో పలుక వేమయ్య...
మమ్మేలు కోవయ్య...
మా తప్పులన్నీ మన్నించవేమయ్యా...
మా మీద కరుణ చూపవేమయ్యా.
మహాదేవ శంభో శరణు.




No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...