Sunday, March 2, 2025

శివోహం

శివా!తీర్దరాజాన్ని నే చేరలేకున్నా
అవిముక్త క్షేత్రాన అడుగు పెట్టాను
ఆధ్యంత రహితా నిన్న తెలియ వచ్చాను
మహేశా . . . . . శరణు.

శివా!నీ చెంత నేనెపుడూ బాలుడినే
జగమంత ఎరుగగ నీ సుతుడనే
నీ తత్వాన నేను వారసుడినే
మహేశా . . . . . శరణు .

శివా!నిప్పు కంట చూడు చల్లగా 
భక్తి జ్ఞాన కుసుమం విచ్చగా
అందున్న పరిమళాలు విరియగా
మహేశా. . . . . శరణు.

శివా!పెక్కు విధముల నీవు పక్కనున్నా
దక్కలేదు ఏనాడూ ఈ నా కంటికి
దిక్కు తొచక నాకు దిక్కు నీవని అంటిని
మహేశా . . . . . శరణు .


శివా!ప్రాణదీపమై ప్రభవించేవు
జ్ఞాన జ్యోతిగా తెలిసేవు
ఆ వెలుగున జ్ఞానం పంచేవు
మహేశా . . . . . శరణు .

శివా!స్పురణ స్మరణగా సాగనీ
స్మరణ శ్వాసకు తోడు నిలువనీ
పదము నెరిగి నీ పదము చేరనీ
మహేశా . . . . . శరణు.

శివా!నుదిటిని నామం మెరుస్తోంది
నోటిలో నామం నానుతోంది
తరియించే మార్గాన్ని తెలుపుతోంది
మహేశా . . . . . శరణు .

శివా!మహా స్మశానాన్ని చేరుకున్నాను
మనో స్మశానాన్ని కోరుతున్నాను
మన్నించి నన్ను మనుపుమయ్యా
మహేశా . . .. . శరణు .


శివా!నవ ద్వారములు నిత్యం తెరచివున్నా
ఈ పంజరాన పిట్ట పారిపోదెందుకో
ఇది ఏమి మ‌ర్మమో ఎరుకకాదు
మహేశా . . . . .శరణు .

శివా!ఆది భిక్షువని అడగవచ్చాను
జ్ఞాన భిక్షను కోరి జోలి పట్టాను
జోలి నిండగ నీవు భిక్ష పెట్టు .
మహేశా . . . . . శరణు .

శివా!ఏటికో శివరాత్రి అంటారు అందరూ
జన్మకో శివరాత్రి అంటాను నేను
ఆ జన్మ ఈ జన్మగా ముగిసిపోనీ
మహేశా . . . . . శరణు.

శివా!నాలోని జ్ఞాతులు ఒకటిగ కూడి
జగడమాడు చుంటిరి నన్ను ఒంటిగ జేసి
జాలి చూపుమా నాతో జత కూడుమా
మహేశా . . . . . శరణు .

శివా!కనిపించే కన్నులు మూసి ఉంచనీ
కనిపించని కన్ను తెరిచి చూడనీ
నేను,నీవేనని తెలియనీ....
మహేశా . . . . . శరణు

శివా!నిన్ను ఆలింగనము చేయు తరుణాన 
అమృత తుల్యమాయె ఆనందాశృవులు
ఆ ఆశృవులు ఋచి మారె ఒక వింతగా
మహేశా . . . . . శరణు .

శివా!కన్నెరుగని కైలాసాన వాసమున్నావు
కన్నెరిగిన కైలాసం కాశీ అన్నావు
కన్నెరిగిన నిన్ను కన్నుమించి తెలిసేదెలా
మహేశా . . . . . శరణు.

శివా!చిటపటలాడే ఈ చితి మంటలు
జ్వాలా తోరణపు కాంతులు తలపించె
తొలగించవయ్యా తోరణపు తగువు
మహేశా . . . . . శరణు .

శివా!చిటపటలాడే ఈ చితి మంటలు
జ్వాలా తోరణపు కాంతులు తలపించె
తొలగించవయ్యా తోరణపు తగువు
మహేశా . . . . . శరణు .

శివా!కరచరణాదుల కానరావు
తేజో రూపమున తెలియరావు
మేధోమథనమున గాని వెలికిరావు
మహేశా . . . . . శరణు .

శివా!తపముతో తరియించు గతినెరుగ
తపన పడుతున్నాను తపమెరుగ
తెలియనీ తపము కూడి నీ జపము
మహేశా . . . . . శరణు .

శివా!తపముతో తరియించు గతినెరుగ
తపన పడుతున్నాను తపమెరుగ
తెలియనీ తపము కూడి నీ జపము
మహేశా . . . . . శరణు .

శివా!వాసమెరుగ వచ్చాను వారణాసి
జపము చేయ తలచాను జాము మరచి
స్మరణ చేయ తలచాను శరణు జొచ్చి
మహేశా . . . . . శరణు .

శివా!వాసమెరుగ వచ్చాను వారణాసి
జపము చేయ తలచాను జాము మరచి
స్మరణ చేయ తలచాను శరణు జొచ్చి
మహేశా . . . . . శరణు .

శివా!సర్వేశ్వరా శరణంటిరా
పరమేశ్వరా పరమీయరా
విశ్వేశ్వరా వరమీయరా
మహేశా . . . . . శరణు .


శివా!నీవు సదా నన్ను సాక మరిసేనులే
మొరలు విన్నావని తెలుసుకున్నానులే
తెలివి కన్ను తెరిపించమన్నానులే
మహేశా . . . . . శరణు .

శివా!ఒదిగిపోవగ నన్ను వొడిసి పట్టేవు
కాలిపోవగ నా కర్మలు కన్ను తెరిచేవు
వెలిగిపోవగ నన్ను నీ తేజాన కలిపేవు
మహేశా . . . . . శరణు .


No comments:

Post a Comment

శివా! పాప పుణ్యాల తాలూకు మూట నా భుజం మీదే ఉంది... నాది నాది నాదే అనుకుని పోగేసుకున్న పాపపుణ్యాలు నాకు తోడుగా ఉన్నాయి నన్ను వదలకుండా... ఆ మూట...