Saturday, July 4, 2020

శివోహం

భాహ్య విషయాలతో భగవంతుని అనుసందానం చేయకూడదు.వాటి అవసరాల కోసం భగవంతుని ప్రార్థించకూడదు. చెడుకు దూరంగా, మంచిలో బ్రతికేందుకు ప్రార్ధించాలి...

ఈ దేహమూ, ప్రాణమూ భగవంతునిదే కనుక ఈ జీవితాన్ని ఆయనకు ఇష్టం వచ్చిన రీతిగా మలచుకొమ్మని ప్రార్ధించాలి. మనకు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉంటూ పదిమంది మంచికొేసం ప్రార్ధించాలి.నిత్యమూ ఆయన సృహలొనే ఉండేలా చేయమని ప్రార్ధించాలి...

ప్రార్ధన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చకున్నా అది మన మనస్సును ప్రభావితం చేయగలదు. కనుక జీవితంలొే ప్రార్ధన అనేది ఒక బాగమైపోయేలా చూసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, July 3, 2020

శివోహం

సిరుల కేమి కొదవ నీకు శ్రీలక్ష్మి ఉండగా
మట్టి పెంకున నీవు ఆరగించేవు
జగముల పోషించేడి ఒజ్జవు గాని
పెరుగు అన్నము తప్ప పట్ట బోవు
భోగ మూర్తిగ నిన్నె చెప్పు చుందురు గాని
కాలు మడుచుట కూడ మరచి నిలిచేవు
మర్మమేదో దాచిమమ్ము మాయజేసేవు
మొక్కు చుంటిని నన్ను ఎక్కు చేయి
....నమో వేంకటేశాయ నమః

శివోహం

కష్టాలకు కారణం 
కైలాసం కానే కాదు

నీవు చేస్తున్న కర్మలు 
నీవు చేసుకున్న ఖర్మలు 

శివోహం  శివోహం

శివోహం

సమస్తచరాచర సృష్టిని శాసించు కర్తవు నీవు....

చావుపుట్టులకలో వలయ చక్రంలో తిరిగే జీవుడను నేను....

సర్వజన పాపకర్మలను మన్నించు దేవదేవుడవు నీవు....

కర్మలు చేస్తూ పుట్టెడు దుఃఖాన్ని అనుభవించే పాపపు జీవుడను నేను...

చావుపుట్టులకలో చక్రం లో తిరిగి తిరిగి అలసిపోయాను.....

మహాదేవా శంభో శరణు...

శివోహం

తండ్రి
శివప్ప 

దృష్టిలో
ఉంటే చాలు

శివోహం  శివోహం

శివోహం

" అవసరం  అనేది "

శివ తత్వాన్ని 
తెలియ చేస్తుంది 

శివ తత్వాన్ని 
నేర్పిస్తూ ఉంటుంది 

శివోహం  శివోహం

శివోహం

జీవితంలో దొరికిన 
అద్భుతమైన జతగాడివి నీవు

శాశ్వత నిద్రకు సాగనంపి 
కైలాసం కానరాక 
ఎక్కడ దారి తప్పుతానో అని
మరుభూమిలో సైతం

ఎదురు చూసే  మిత్రుడవు
భవుడవు ... హరుడవు 
శివుడవు ... మహాదేవుడవు 
ప్రాణ ప్రియుడవు నీవే తండ్రీ 

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...