Saturday, July 18, 2020

అమ్మ

జగముల చిరునగవుల పరిపాలించే జననీ...
అనయము మము కనికరముగ కాపాడే జననీ....
అమ్మ శరణు అని వేడితే మోహపాశాలను తొలగించి కాపాడే జననీ...

నీవే శరణు...
అమ్మ దుర్గమ్మ శరణు...

శివోహం

మా కనులకు కానరాని నీవు...

కండకావరమెక్కి నిను గానక మేము కళ్ళు మూస్తుంటావు... 

నడుమ కష్టాల నిచ్చి నిదుర మత్తు నొదిలించి కళ్ళు తెరిపిస్తుంటావు ...

మరి యిక మాయతెరలు తొలిగించేదెపుడో  ...
మా యీ కనులకు..

మహాదేవా శంభో శరణు...

Friday, July 17, 2020

శ్రీరామా

నీవు చేసే పనుల ఫలితమే. నీకుంటుంది. తక్కిన.  ప్రపంచం  తలక్రిందు కానివ్వు దాన్ని  లక్ష్యపెట్టక. ఋజుమార్గంలో
వెళ్ళు ఆనందానికి  యిదే మార్గం  అసూయను జయించటం చాలా సులువు దాని వలన మనకు లాభము లేదు అవతలవారికి ఏ నష్టమూలేదు  భగవంతుడికి చెడంటేను  చెడుకు భగవంతుడంటేనూ భయం మంచి యుెక్క ఫలితం గోప్పది
చెడుకు ఫలితం స్వల్పం.                                                         *జైశ్రీరామ్ జైజైహనుమాన్*

శివోహం

జీవుడు జననం నుండి మరణం వరకు సాగే 
చిత్రవిచిత్రమైన జీవనయాత్ర నాలుగు మాటలలో

ఎవరికీ ఎవరూ ఈ లోకంలో ఎవరికి ఏమి కారు
 నా వారు అంటున్నావు ఎవరూ నీ వారు
నీది ఏది ఉన్నది ఈ ప్రపంచంలో
నువ్వెక్కడ నీ అందమెక్కడ 
కోరికల వలయములో చిక్కిన నీవు 
చిగురాకు మాదిరి ముడతలు పడి
కొమ్మనోదిలి క్రింద రాలి చిరిగి చెదలు పట్టి 
నేలలో కలిసిపోతివే 

నేల నుండి నింగి వరకు ఏదియు నీది కాదు
విశ్వమంతా విశ్వనాథుడే వ్యాపించి ఉన్నాడని
తెలియక అంతరంగం అంతయూ నేను నేను అన్న అహము కరిగి చివరికి కాటిలో కలిసిపోయే నీ కాయముతో సహా ఆత్మ పరమాత్మ ను 

చేరుటే గానీ పాపాల మూట తో రాలుటకు ముందు
ఒక్కసారి అయినా శివా శివా అన్నావా
ఏనాడైనా సత్సంగానికి వెళ్లి శివ శివ ఆన్నావా
ఎప్పుడూ సంతోషంగా జీవించలేదే
 ఉన్న సంపదలతో ఆత్మ శాంతి కలగలేదే

ఈ రోజు కట్టెల పాన్పు పై కదలక పడుకుంటివే ఇంత కష్టపడిన నీవు నీ వెంట వచ్చిన సంపద ఏదీ
ఎక్కడ నిన్ను కన్న తల్లి తండ్రులు
ఎక్కడ నీ ప్రియమైన సతీమణి 
ఎక్కడ నీకు పుట్టిన బిడ్డలు
ఎక్కడ నీ మీద ప్రేమ చూపించే బంధువులు
ఎక్కడ నిన్ను అభిమానించే స్నేహితులు
అన్ని విడిచి అందరిని వదిలిపోతివి
ఏనాడు శివ నామాన్ని పలుకక అత్మవై పైకీ ఎగిరితివే

ఇదేనా ఈశ్వరుడు ఇచ్చిన జన్మకు నివిచ్చే సందేశం
కాదు కాదు అలా ఎప్పటికీ కాకూడదు 
జన్మకు అర్ధము మోక్ష సాధనయే లక్షము

ఓం నమః శివాయ.....

శివోహం

నా గుండె గూటిలో ఉన్నది నీరూపమ మహాదేవా.. 
నాలుగు గదులు మీరు నలుగురు...
ఊపిరి నందితో నేననునిత్యం నీ
రూపాన్ని నాగుండెపై చిత్రించుకుంటాను...
నిదురలో మెలకువలో మీరే నా ధ్యాస
చెరగనీయకు నీ చిత్రాన్ని
చెదరనీయకు నా హృదయాన్ని

మహాదేవా శంభో శరణు...

శివోహం

నీ  కరుణ సిరులు 
దొరకితే కదా తండ్రీ 

జాలువారే 
కన్నీటి సుడులు

నీ పాదాలను
అభిషేకించేది 

శివోహం  శివోహం

శివోహం

తండ్రి శిరముపై 
గంగమ్మ ఉంటుందని  
హిమవత్పర్వత స్థాణువులన్నీ 
సాంబ సదా శివుని 
స్థావరాలని నేనెరుగనా

మన బాధలన్నీ 
అగ్ని పర్వతాలైతే 
తన హృదయంలో 
నిక్షిప్తం చేసుకున్న 
శివప్ప హృదయమే 
నాకు ఆదర్శం 

సకల చరాచర 
సృష్టి లోని 
ప్రతి జీవి యొక్క 
సంకల్పమూ నాదే 
ఆ ప్రాణుల
మూగ వేదనలూ నావే 

శివోహం  శివోహం

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల