Wednesday, August 12, 2020

శివోహం

ఎక్కడో దూరాన కూర్చున్నావు...
కుటుంబ సభ్యులందరున్నా ఒంటరిగా మాకొరకు తపస్సు చేస్తూ...

నిన్నన్వేషించాలని నేనూ తపస్సు చేద్దామని కూర్చుంటే బంధాలు బంధువులు బాంధవ్యాలు నిన్ను చేరనీయక అడ్డుకుంటున్నాయి...

నిను కనుగొనే దారిచూపవా తండ్రి...

మహాదేవా శంభో శరణు....

Tuesday, August 11, 2020

శివోహం

భగవంతుడు నీకు అత్యంత దగ్గరవాడనే కృతనిశ్చయంతో నీవే జీవిస్తే...

భగవంతుడు తప్ప మరేదీ లేదు అంటూ తెలుసుకుంటావు...

శివోహం

ఎక్కడ ఎప్పుడు పుట్టేది తెలియదు...
ఎప్పుడు ఎలా పోయేదీ తెలియదు.  
ఏమిటో ఏరోజు ఏమిజరుగునో ఎరుకున్నవాడవు నువ్వు...

నీ దయ తండ్రి...

శివోహం

శంభో...
నీ జటాఝూటం నుండి ఉరుకుతున్న గంగమ్మ...

నిను విడవలేక విచారంగా వుందేమో...
అందుకేనేమో  

నా కనుల కొలను నుండి కన్నీటి రూపంగా నిను స్మరిస్తూ బయటకు వస్తోంది...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఎక్కడ ఎప్పుడు పుట్టేది తెలియదు...
ఎప్పుడు ఎలా పోయేదీ తెలియదు.  
ఏమిటో ఏరోజు ఏమిజరుగునో ఎరుకున్నవాడవు నువ్వు...

నీ దయ తండ్రి...

శివోహం

నాకు నేనే గురువు...
నా ప్రశ్నలన్నింటికి నాకు నేను సమాధానం చెప్పుకోగలను...

Monday, August 10, 2020

శివోహం

కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం...
సచ్చిదానంద రూపం...
సచ్చిత ఆనంద స్వరూపం...
కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం... మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం...
శ్రీకృష్ణుని రూపం నల్లనిది....
మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది...
నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడు...

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు, పెద్దలకు, గురువులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...