Sunday, August 16, 2020

శివోహం

తల్లి
ఒడిలోకి వదిలేసి

ఏ తలుపులూ వేయకుండానే
ఏ తాళాలూ బిగించకుండానే

వెళ్ళిపోతూ ఉంటారు
ఎంత నమ్మకమో కదా ?

ఎందుకంటే 
అక్కడ ఏమీ ఉండదు మరి ??

తోడుగా
ఒక్క తండ్రి శివుడు తప్ప 

శివోహం  శివోహం

శివోహం

ఔను 

నీవు ప్రసాదించే 
అనిర్వచనీయమైన

ఆనందానుభూతుల 
స్వేచ్ఛా స్వాతంత్ర్యాల  కోసం 

నీ వైపు వడి వడిగా 
అడుగులు వేస్తున్నాను  తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

మౌనమే
నీకు భూషణం

ఒక్క మాట కూడా
మాటాడనే మాటాడవు

స్థిత ప్రజ్ఞతే
సాటిలేని ఆయుధం నీకు

శివోహం  శివోహం

శివోహం

కలుషితమైన దేహంలో
వర్షించే నా కన్నీళ్లు నీకేలనయ్యా
స్వచ్ఛమైన
మా తల్లి గంగమ్మ 
నీ చెంత ఉండగా 

నీ భిక్షను స్వీకరించి
అదే భిక్షను ప్రతి భిక్షగా ఒసగే
నా నైవేద్యాలు నీకేలనయ్యా
అమ్మ జగన్మాత 
అన్నపూర్ణేశ్వరీ దేవి
నీ చెంత ఉండగా 

నేను పూసుకుని
రాసుకుని తిరిగే
విభూదులు నీకేలనయ్యా
అఖండమైన భస్మరాశులు
కోకొల్లలుగా 
నీ చెంత ఉండగా 

శివోహం  శివోహం

శివోహం

*ఆకాశానికి భూమికి నడుమ* 
*ఆధారమేలేని*
*అందమైన బంగారుపంజరంలో*
*బంధీనై ఉన్నానిన్నినాళ్ళూ!*
*పనిలేక రెక్కల పాటవము*
*పరీక్షించే వీలే లేదిన్నాళ్ళూ!*
*దుఃఖపువేవిళ్ళలొనే కాలమంతా*
*దశాబ్దాలుగా పురుడు పోసుకుని*
*యుగాంతమైనా దిగంతాలలోకి ఎగిరిపోతునే* *ఉంది అయినా నాలో చలనంలేకుండా*
*దిక్కూమొక్కూ లేకుండా*
*శూన్యంలో గ్రహ శకలంలా*
*బరువేలేని బానిసనై బ్రతుకీడ్చాల్సివచ్చింది*
*బంధించిన ఒంటరి తనపు కట్టుబాట్లు,ఆంక్షల* *పంజర కమ్మీలు*
*పటాపంచలూ చేశానీరోజు...*
*రెక్కలు విప్పిన విహంగమునై*
*స్వచ్ఛగగనాన స్వేచ్చావాయువులు పీల్చాను*
*చచ్చుబడిన రెక్కలలో నవచైతన్య శక్తి ఇంధనంగా*  
*ఎక్కుపెట్టిన శరమునై అవకాశ ఆకాశవిపణిలో*
*నా గమనరేఖలు నేనే లిఖించుకుంటూ*
*గమిస్తుంటా స్వేఛ్చగా గగనవిహారినై....!* 
*అవకాశాల ఆకాశాన్ని ఏలే ఆకాశరాజుగాఎగిరి* *పోతుంటానుగమ్యంవైపు...!* 
*వస్తారా ....😊మిరుకుడా...!*


Saturday, August 15, 2020

స్వామి శరణం

నా జీవన పయనం నీ కోసం..
కాలం కరిగిపోయినా...
వయసు తరిగిపోయినా...
చూపు చిన్నబోయినా...
మాట మూగబోయినా...
ఆగను ... ఆపను ...
నడుస్తూనె ఉంటా నిన్ను చేరేవరకు..
పిలుస్తూనె ఉంటా నువ్వు పలికేవరకు...
హరిహారపుత్ర శరణు...

శివోహం

సమస్త భూతములను సృష్టించేది, పోషించేది, లయంచేసేది ఆ పరమత్మే.

అలలు సముద్రంలోనే పుట్టి, కొంతసేపు ప్రయాణించి, తిరిగి ఆ సముద్రంలోనే కలిసి పోతాయి. 

వర్షంలో పైనుంచి పడ్డ చినుకుల వల్ల క్రింద పారే నీటిలో బుడగలు పుట్టి, కొంత దూరం ప్రయాణించి, అందులోనే 'టప్' మని పగిలిపోతాయి.

స్వప్నం అనేది నిద్రించిన జీవుడి మనస్సులో సృష్టించబడి, కొంతసేపు ఉండి, తిరిగి ఆ మనస్సులోనే లయమై పోతుంది.

అలాగే ఈ జగత్తు లోని జీవుళ్ళు అన్నీ కూడా ఆత్మయందే పుట్టి, కొంత కాలం ఉండి చివరకు ఆత్మయందే లయమైపోతాయి.

సూర్యుడు, 
చంద్రుడు, 
నక్షత్రాలు, 
అగ్ని, 
దీపం, ఇవన్నీ వెలుపలి జ్యోతులు.

కన్ను, 
ముక్కు, 
మనస్సు, 
బుద్ధి ఇవన్ని అంతరంగ జ్యోతులు.

ఇవన్నీ స్వయం జ్యోతులు కాదు.

ఎవరో ఒకరు శక్తినిస్తే వెలిగేవి మాత్రమే. 
‘వేడినీరు’ అన్నప్పుడు వేడి ఆ నీటిది కాదు. అది అగ్ని లక్షణం. అలాగే ఈ జ్యోతులన్నింటికి వెలిగే శక్తి వాటిది కాదు. ఆ శక్తి ఆత్మది. సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అని సైన్స్ చెబుతుంది. కాని అవి కూడా ఆత్మ యొక్క శక్తి వల్లనే ప్రకాశిస్తున్నాయి. అలాగే మన కన్ను, ముక్కు మొదలైన ఇంద్రియాలు కూడా ఆత్మశక్తి వల్లనే పనిచేస్తున్నాయి. అన్నింటిని తెలుసుకో గలుగుతున్నాయి.

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...