ఓ త్రినేత్రా
నాలోని త్రిగుణాలను
తలో దారి పట్టించవేమి ?
హే విశ్వేశ్వరా
నాలోని విద్యా అవిద్యలను
వినాశన మొందించవేమి ??
ఓ ఆది దేవా
నాలోని అష్ట రాగాలను
ఆవల దిక్కులకు విసిరేయవేమి ?
హే పరమేశ్వరా
నాలోని పంచేద్రియాలను
పంచ భూతార్పణం కావించవేమి ??
కళ్ళు మూసుకుంటే ఎలాగయ్యా ?
కాస్త కళ్ళు తెరిచి చూడవయ్యా ??