ఈ రమణుడై వచ్చే భగవానుడు
నిజతత్వ మెరిగించె శుభ నాముడు
తానన్నదేమిటో తెలిసున్నవాడు
తనువన్నదేమిటో తెలియజెప్పాడు
తన మతము జన హితముగా తెలిపినాడు
తరతరాలకు తానె మార్గదర్శకుడు
పైనున్న దేమిటో పట్టించుకోడు
లోనున్న దేమిటో తెలుసుకో మంటాడు
నీ పూజ పద్దతిని మార్చుకోకుండా
నీవెవరో తెలుసుకొని మెలగమన్నాడు
ఉపదేశాల ఊసులేదు ఉపన్యాసాల మాటలేదు
ఊరకనే ఉండు అదే సత్యమన్నాడు
నిశ్చలంగా ఉండు అదే దైవమన్నాడు
సహజ స్థితినుండుటే సకలమన్నాడు
జయ జయ రమణ సహజ నిజ గమన