Thursday, October 8, 2020

శివోహం

ఆ మూడు రేఖలు నా నుదుట నిలిపి...
నడుమ కుంకుమ బొట్టు నీ గుర్తుగా నిలుపవా...
నా ముఖంలో కనిపించే ముడతలు నీ రూపాలే కదా శివ...

మహాదేవా శంభో శరణు...

Wednesday, October 7, 2020

శివోహం

శంభో!!!
నీటి బుడగలాంటి బ్రతుకు... 
నీటి అలలవలే సంపద... 
మెరుపువలే జీవితం... 
ఉరుముతున్న కష్టాలు... 
శరణాగతుడనైతిని శివ.... 
దయచూపు...
కరుణతో రక్షించు...
మహాదేవా శంభో శరణు....

శివోహం

శివా! నా గుండె బండరాయి అనుకున్నా
నీ నామం పలుకుతుంటె తెలిసింది
అది బండరాయి కాదు పలుకురాయని .
మహేశా ..... శరణు.

శివోహం

శివా! నా గుండె బండరాయి అనుకున్నా
నీ నామం పలుకుతుంటె తెలిసింది
అది బండరాయి కాదు పలుకురాయని .
మహేశా ..... శరణు.

శివోహం


సదా నాతో ఉండువాడు...
ఎప్పుడు నన్ను విడిపోని వాడు...
ఎల్లప్పుడూ నన్ను కాపాడి కరుణించే వాడు ఈశుడే...
శివుడే సత్యం శివుడే నిత్యం...

ఓం శివోహం... సర్వం శివమయం

హారేకృష్ణ

మనస్సుకు, బుద్ధికి కూడా అందని పరమపవిత్రమైన అనుభూతే ప్రేమ. ప్రేమ బందించదు, బాధించదు.
అది స్వేచ్చాయుతభావం
స్పష్టత
సరళత
సౌమ్యత
స్వచ్ఛత
స్వేఛ్చ దాని స్వభావం.
ప్రేమనేది ఓ స్థితి.
ఆ స్థితిని అనుభవించాలి.
మనస్సు నిర్మలమై, నిశ్చలముగా వుండి దేనినీ ఆశించకుండా, దేనినైన అంగీకరించగలిగే స్థితిలో వున్నప్పుడే ప్రేమస్థితి సంపూర్ణముగా అనుభూతికి వస్తుంది.
ఆ స్థితిలో వుండగలిగితే ఏది చూసిన, ఏది ఎలా వున్నా, ఎవరితో వున్నా ప్రేమగానే స్పందిస్తాం, అనుక్షణం ప్రేమను ఆస్వాదిస్తాం, ఆనందముగా జీవిస్తాం.
ఎన్నో భిన్నత్వాలుతో కూడుకున్నది భగవంతుని సృష్టి.
అయినా అన్నిటిని ఏకత్వముతో చూడగలిగే ప్రేమత్వమును పొందుపరిచాడు.
ఆహా ఎంతటి చమత్కారుడు ఈ సృష్టికర్త...

ఓం శ్రీ కృష్ణపరమాత్మనే నమః
జై శ్రీమన్నారాయణ

హరే కృష్ణ

యశోదమ్మ ప్రేమకి తలవంచి తాళ్లకే వశమయ్యాడు వంశీకృష్ణుడు. ఆ అనంతుడుని ఓ త్రాడుతో బంధించడమా...

ఎవ్వరికైనా ఇది సాధ్యమా? యశోదతల్లి ప్రేమకే అది చెల్లు.
ఆహా అచ్యుతుడునే మురిపంతో బందీ చేసిన ఈ ప్రేమ అనిర్వచనీయం.
కృష్ణుని రూపం తలచుకోగానే చేతిలో వేణువు, తలపై పించం గుర్తుకొస్తాయి.
పిల్లనగ్రోవి లేని కృష్ణుడుని ఊహించలేము.
కానీ రాధ మధురప్రేమకి పరవశం అయిన కృష్ణుడు, రాధ భౌతికముగా లేదన్న వార్త తెలియగానే మురళినే శాశ్వతముగా విడిచిపెట్టేశాడు.
రాధ పరమప్రేమ పరమాత్మున్నే కదిలించింది, కలచివేసింది.

ఆహా ఎంతటి దివ్యమైనది ఈ ప్రేమ...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...