Monday, December 14, 2020

శివోహం

క్షీరసాగరమధన సమయాన లోకాల కాపాడనెంచి
గరళాన్ని పాయసమువలె తీసుకుని గొంతున ఉంచి
హరా...
నీకొరకై అమ్మ గంగమ్మ-సతి పార్వతి
నిరంతరం అభిషేకించినా, చల్లారని నీగొంతున వేడి
క్షీర, మధుర రసాలతో అందరూ చేసే చిరు అభిషేకాలకు
పొంగిపోయి, గుండెలనిండుగ మము దీవించ నీగణ
సమేతముగ వచ్చి దీవించు చుంటివి గండర గండా...

నిను ప్రార్ధించిన నీపరీవారమంతా ఒక్కటై నను
దీవించు చున్నారు...
అందరూ - అగణిత ఆశీర్వచనములందించు చున్నారు...

నేనేమి చేయగలను పూజలు-పుణ్యకార్యాలు
శివనామస్మరణం తప్ప....

మహాదేవా శంభో శరణు

అయ్యప్ప

ఈ భోగ భాగ్యాలూ  సుఖసంతోషాలు 
అన్నీ  తాత్కాలిక మైనవే...

భగవంతుని కరుణ దయ ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరూ పంచేద్రియాలను నిగ్రహించుకుని పరమాత్మకై తపించాలి...

ఇతర విషయాలపై మన దృష్టిని కేంద్రీకరిస్తే కాలం వృధా అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు...

ఇతర విషయాలపై  నీ  మనస్సునీ  బుద్దిని కేంద్రీకరించకు...

సదా నన్ను  గుర్తుంచుకో  అప్పుడే  నీ  జ్ఞాన చక్షువులు 
లౌకిక విషయానురక్తిని వీడి శాశ్వాతానంద ముక్తి మార్గం వైపు పయనించి  నిన్ను  పరిశుద్ధణ్ణి చేస్తాయి స్థితప్రజ్ఞుడవు  అవుతావు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...

శివోహం

సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసేవాడు...
స్వయం ప్రకాశ తేజోమయరూపుడు మహాదేవుడు...

ఓం శివోహం... సర్వం శివమయం...

శివోహం

కట్టెలో తేమ తీరకముందే నీ సన్నిధికి చేర్చుకో...

ఓపిక తగ్గి నడుం వంగి నడవలేని స్థితిలో వెలుగుతున్న సూరీడులో నీ రూపం చూస్తున్నాను...

నీవెలుగు రేఖలు పంపి నిను చేరే దారి చూపించు.. 

మహాదేవా శంభో శరణు...

Sunday, December 13, 2020

శివోహం

చంచలమైన మనసు దేవునిమూర్తిపై నిలువదు నిజమే...

కానీ ఆ మనసు ఎక్కడికి పరుగులు తీసినా అక్కడ పరమాత్మ ఉంటాడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, December 12, 2020

శివోహం

త్రిదళం  త్రిగుణాకారం ....
త్రినేత్రంచ  త్రి ఆయుధం ....
త్రిజన్మ  పాప సంహారం .... 
ఏక బిల్వం  శివార్పణం ....

ఓం శివోహం...సర్వం శివమయం

Friday, December 11, 2020

ఓం నమో వెంకటేశయా

 ఒక్కసారి నీవు నీ భాదలను నాకు చెప్పుకున్నాక అంతా నేనే చూసుకుంటానన్న నమ్మకంతో వాటిని గురించి అలోచించడం మానేయాలి. వాటిని గురించి మరళా మరళా నాకు చెప్పనవసరం లేదు. నీ ప్రార్ధన నిజమైనదై ఉంటే అది తప్పక నాకు వినపడుతుంది. నీ ప్రార్ధన నిజమైనదని నాకనిపించినపుడు నీ కొరకు ఏదైనా చేస్తాను. ఎంత భారమైనా సరే నేను మెాస్తాను....

 సందేహానికి తావివ్వకు. ఈ సృష్టినంతటినీ భరించి పోషించుచున్నవాడిని నీ భాదలు తీర్చడం నాకు పెద్ద సమస్య కాదు. కాకపోతే దానికి కొంత ‌సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందనేది కేవలం నీ భక్తి విశ్వాసాలపై ఆధారిపడి ఉంటుంది.  హృదయమందు భక్తి విశ్వాసాలు అభివృద్ది పరచుకొనక భగవంతుని అనుగ్రహం కావాలనుకోవడం అజ్ఞానం,అసంభవం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...