స్మశానం ఒక జ్ఞానమందిరం
బ్రతికున్న మనిషికి
నీరాజనాలు పట్టడం సహజమే
భయమో,భక్తినో,అవసరమో గాని
ఆ మనిషిని అందలమెక్కించి
భుజమిచ్చి పైకెత్తుతుంటాము
కానీ చచ్చిన శవానికి
విలువనిచ్చే ఏకైక మందిరం స్మశానమే
నిలువనీడలేని మనిషికి కూడా
ఆరడుగుల నేల నిచ్చి భుజంతడుతుంది
అక్కడ పేర్చిన కట్టెలను చూస్తుంటే
ఇంకెప్పుడా అన్నట్లుగా ఏ సంబంధంలేని ఆత్మీయుడి కోసం ఎదురుచూస్తుంటాయి
బొక్కపెట్టిన కుండ
బోరున ఏడుస్తుంది
చివరకు ఆ శవం కోసం
ఆత్మార్పన చేసుకుంటుంది
నిప్పంటించిన కట్టెలలో
ప్రేమగుణం కన్పిస్తుంది
అవి ఆ శవాన్ని ఆలింగనం చేసుకొని బూడిదవుతాయి
ఇవన్నీ చూస్తుంటే
నిజమైన ఆత్మీయనురాగాలు స్మశానంలోనే కానవస్తాయి
ఆ మండుతున్న అగ్ని సాక్షిగానే
మన జీవితనిర్మాణ క్రమానికి పునాదిరాళ్ళు పడతాయి
ఆ అగ్నిసాక్షిగానే మనం మటుమాయమవుతాము
నిజంగా మనిషి పాఠాలు నేర్చుకోవాల్సింది
ఈ జ్ఞానమందిరంలోనే
బహుషా దేవుడందుకే మనల్ని
అప్పుడప్పుడు అక్కడికి పంపిస్తుంటాడు.
ఓం శివోహం... సర్వం శివయమం