Sunday, January 3, 2021

శివోహం

ఎన్ని జన్మలెత్తినా నీరూపం మానవులకు అపురూపమే మాధవా ....

ఎన్ని పరిమళాలు తాకినా నీ తలపు పరిమళం సుగంధమే మాధవా....

ఎన్ని స్వరాలు విన్నా నీ మురళీ గానం మార్దవమే మాధవా ...

ఎన్ని నామాలు స్మరించినా నీ నామం అనునిత్యం 
ఆనందమే మాధవా ..

శివోహం

సదా శుభాలనిచ్చే దేవధిదేవా...
సదాశివా నాకు ఎవరు వున్నారు అనుకున్నప్పుడు.... 
మొదటి గా గుర్తొచ్చేది నువ్వే తండ్రి...

మహాదేవా శంభో శరణు...

ఓం

ఈ రక్తం పరీక్ష చేసి ఏ కులమో చెప్తే ఈ కుల వ్యవస్థను నేను నమ్ముతాను...
కులం మీద నమ్మకం లేని సగటు మనిషి ప్రశ్న...
ఎవరు తీర్చగలరు...?

శివోహం

భక్తి పంజరములో భందీని శ్రీ కృష్ణ
పంజరము వీడిపోను! భాదలెన్నున్నా!

కాంతిలో కాంతితో కలిసిపోయేదాక
కడదాకా నీతోనే కలిసి పయనించెదను

వన్నెలను చిన్నెలను వయ్యారములు జూపి
మధురమగు నీ మురళి మాధుర్యమును బడితిని
తిరిగిపోనెన్నటికి జేరనింకెవ్వరిని
జన్మ జన్మలదాక జెరియింతు నీతోనే

పంజరము నుండి నన్ను బయలులో వదిలినను
మబ్బులలో వదిలినను మరలా తిరిగి వచ్చెదను
నీ భక్తి పంజరమున నీడనుందును కృష్ణా

కన్నార నను చూచి చెన్నార యద చేర్చి
తీయని మురళిని చేర్చునందాకను
విచ్చిన పూదీవె విడిన పూవుల రీతి
జన్మలెన్నెయినను చరియింతు నీతోనే

Saturday, January 2, 2021

శివోహం

మూడు కళ్ళు  కలిగినవాడు  
అనగానే  మనం  కన్నుని చూడడానికే 
ఉపయెగించేవాళ్లం  కాబట్టి  ---
మూడవ కన్నుతో  ఎలా  చూస్తాడు  ?....
అని  ఆలోచిస్తాం  ---
కానీ  శంకరుని మూడవ కన్ను  
చూడటం కోసం  ఉపయోగించే  మిగిలిన
రెండు కళ్ల వంటిదీ  కాదు  

ఏ కుడి కన్ను  సూర్యుడో
ఏ ఎడమ కన్ను  చంద్రుడో
ఆ రెండు  కన్నులకీ కావల్సిన.
సంపూర్ణ శక్తిని అందించ గలిగిన. తేజస్సు
తనలో నింపుకున్న. కన్ను మూడవ కన్ను
అందుకే  చంద్ర సూర్యాగ్ని  నేత్రైః  --
చంద్రుడూ  సూర్యుడూ   అగ్ని
అనే  మూడు  నేత్రాలతో  
విరాజిల్లేవాడు  శంకరుడు 

మహా  ప్రళయాన్ని  సృష్టించే  సందర్భంలో
ఇదే  శంకరుడు ఆకాశంలోని పన్నెండుమంది 
సూర్యులన్నీ  ఒకే ఒక్క. మారు ఉదయించేలా 
చేసి  అందరి తేజస్సుల్నీ  ఒక్కచోట.
కేంద్రీకరించేలా  చేసి  
చెప్పలేని  వేడిమిని  సృష్టించి  
మొత్తం  ప్రపంచాన్ని  మాడ్చివేయగల
శక్తి  శంకరుని తేజస్సుకి మాత్రమే  ఉంది  !!

శంకరునికి  పినాకమనే  పేరు
గలిగిన విల్లు ఉంది  అందుకే  
 అందుకే  ఆయన పేరు  పినాకపాణి  అని
ఆకాశంలోని పిడుగు ఏడుందో --
దానిలోని శక్తి మొత్తం  తన పినాకంలో 
ఉండేలా  నిక్షిప్తం చేసుకున్నాడు  కాబట్టే  
ఒక్కసారి దాని వింటివారిని లాగి చూసినట్లయితే  
ఆకాశం  మొత్తం  ఈ ధ్వని  ప్రతిధ్వని రూపంగా  
ప్రపంచాన్ని ముంచివేస్తుంది

శంకరుని  తేజస్సు  సామాన్యమైనది 
కాదు  కాబట్టే   శరీరమంతా  తేజోమయం 
కాబట్టే  శంకరుడు శరీరచ్చాయలో 
నీలోహితః  చెప్పలేనంత
ఎర్రదనంతో  ఉంటాడు

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!మారుతున్న జగతిలోన మసలుచున్న నేను
మారని నిన్ను చేర ముడుపు మూట కట్టినాను
ముడుపు నాకు చెల్లనీ మూట నీకు ముట్టనీ.
మహేశా.....శరణు.

శివోహం

బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మనతో ఉన్నవాళ్లు మాత్రమే మనవాళ్ళు...

తరువాత మనకు తోడు భగవంతుడే అవుతాడు...

ఓం నమః శివాయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...