శంభో!!! ఈ మాయామోహ జగత్తులో ,సంసారం అనే సముద్రంలో వివశులై దారి తెలియని స్థితిలో ఉన్నవారికి...
అద్భుతమైన,జీవన మాధుర్యంతో బాటు, మానవజన్మ ఉద్దరణకు వలసిన సద్గతిని ,సన్మార్గాన్ని ,సద్భావనతో తరించే భాగ్యాన్ని కలుగజేయుము తండ్రి...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.