Tuesday, February 2, 2021

శివోహం

యావత్తు భూమి నీ స్వరూపమే కదా శివ...
బ్రహ్మ - విష్ణు లు కనుగొనలేని శివస్వరూపం ఇది....
నీవు నిరాకారుడవు ఎలా అనుకుంటాం...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం సర్వం శివమయం

Monday, February 1, 2021

శివోహం

మౌనంగా కనులు మూసుకొని...
మనసులో నీ రూపు నిలుపుకొని.. 
ఆర్ధతా భావంతో పలకరించే వేళ....
కనులు తడిబారినా అడుపుచేసుకోగలను...
కానీ గుండె గదుల్లో నీవు కనిపించి మాయమైతే తట్టుకోలేను...
శివ నాలో ఉండమని కోరుకుంటున్నాను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

భవ భయ హరుడు...
కరుణామయుడు...
లయకారుడు...
కట్టకడదాకా తోడుండువాడు నా మహాదేవుడు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నా ఆరాటం...
నా తాపత్రయం...
నిన్ను చేరాలనే మహాదేవా...
ఆత్మస్థైర్యం నాలో పెంచి...
రోగాలను నెదిరించే మనోబలం శక్తిని నాకివ్వు....
నా కడదాకా నీ నామం మరవను....

మహాదేవా శంభో శరణు...

ఓం గం గణపతియే నమః

పార్వతీనందనం దేవం 
విఘ్నరాజం గణాధిపం
గజాననం మహావీర్యం 
వందే సిద్ధి వినాయకం 
భక్తప్రియం ఉమాపుత్రం
విశ్వవంద్యం సురేశ్వరం
అంబికా హృదయానందం 
వందే మూషికవాహనం 

ఓం గం గణపతియే నమః

శివోహం

శంభో!!! నువ్వు నేను  సగం సగం....
నాలో నువ్వు  సగం.....
నీలో నేను  సగం....
ప్రాణం నాది అయితే.....
అందులో  ఊపిరి నువ్వు....
జీవం నాది అయితే.....
అందులో ఉనికి  నువ్వు....
హృదయం  నాది అయితే.....
అందులో  స్పందన  నువ్వు....
ఈ దేహం  నాది అయితే....
అందులో  ఉన్న  ఆత్మ  నువ్వు.....
జీవాత్మను నేను  అయితే.....
పరమాత్మవు నువ్వు....
బాహ్యంగా నేను.....
అంతర్లీనంగా  ఉన్నది నీవే కదా శివ...

మహాదేవా శంభో శరణు
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

కాయానికి మూలం మనసు...
ఎప్పటికప్పుడు శుద్ది చేసుకుంటే యే చెడు లోపలకు రాదు...
వచ్చినా లోన శివుడు జీవాన్ని అంటనివ్వదు....
ఆ శివుడు మూడో కంటికి కాలి బూడిద కావలసినదే...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...