Monday, March 29, 2021

శివోహం

శివుడు 'మోక్షం'తో సంబంధం కలిగి ఉంటాడు, ఇది జన్మ మరియు మరణ చక్రం యొక్క ఉపశమనం. మోక్షం ద్వారా, అతను వాస్తవానికి "కామ, క్రోదా, మొహ, మాడా మరియు లోబా" యొక్క భ్రాంతితో కూడిన ప్రపంచం నుండి మాకు తీసుకువెళుతున్నాడని మరియు మనం ఎవరో మరియు మన ఉనికి యొక్క వాస్తవిక ఉద్దేశ్యం ఏది అని తెలుసుకునేలా చేస్తుంది. అందువల్ల శివుని నాశన శక్తి సార్వజనిక స్థాయిలో గొప్ప శుద్ధి శక్తిని కలిగి ఉంది. ఈ విధ్వంసం విశ్వం యొక్క నూతన సృష్టికి, మార్గం మరియు సార్వత్రిక యొక్క నాటకం కోసం ఒక అవకాశాన్ని తెరుస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

గౌరీమనోహరా...
భక్తజనప్రియా...
ఆనందస్వరూపా...
నాగాభరణా...
నీకు సహస్రాధిక శతకోటి సాష్టాంగ ప్రణామాలు...
దయాసింధూ ఆపద్బంధూ శరణు...

Sunday, March 28, 2021

శివోహం

నిను నమ్మిన వారికెన్నడు నాశము లేదని...
గట్టి మనసుతోనే అడిగా అంతరాత్మ లో....
నాకు‌ నీవు గాక మరెవ్వరున్నారు ప్రభూ....
నా మనసునెరిగిన నీకే నా మీద దయలేకపోతే వేరెవ్వరు నా మొరాలిస్తారు తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

దేవుడిచ్చిన అద్భుతమైన, అపురూపమైన, అందమైన మనుష్యజన్మ ను విజ్ఞానాన్ని సార్ధకం చేసుకోవాలి...

అలసత్వం కలుగకుండా అనుక్షణం జాగ్రత్త పడుతూ  ఉండాలి అప్రమత్తంగా ఉండాలి...

మనలో అంతరంగంలో నిద్రాణం గా ఉన్న అంతరాత్మ అసలు స్వరూపాన్ని,అది అందించేపరమార్ధాన్ని గ్రహిస్తూ గుండెల్లో దైవభక్తిని చెదరకుండా నింపుకోవాలి...

విశ్వశ్వరుణ్ణి నిర్మల హృదయంతో ధ్యానిస్తూ వేడుకోవాలి ఆర్తితో ఆక్రోశించాలి...

అందుకు కావాల్సిన శక్తినీ, బుద్దీని స్పూర్తిని అనుగ్రహించమని ప్రార్తించాలి కూడా...

మనం అనుభవిస్తున్న కర్మఫలం తో బాటు ఈశ్వరుని కృపను, వివేకాన్ని, కరుణించమని కోరుకుందాం....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

మనస్సును కదిలించే దివ్యమైన మంగలకరమైన దృశ్యం తో ఒక గంట సేపు లయం చేస్తూ తాదాత్మ్యం పొందడమే దైవభక్తి...

ఇలా మనలో దైవారాధన భావము పెంచుకోవడం కన్నా మహాభాగ్యం జీవితంలో ఇంకా  ఏముంటుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, March 26, 2021

శివోహం

కళ్ళుమూసుకొని పంచాక్షరీ చదువుతుంటే
మనసులో ఎదురుగా కైలాసం...
హిమాలయాలు ఎన్నో శిఖరాలు...
ఇదొక్కటే పూర్వ జన్మలో నేను చేసుకున్న పుణ్యం...
చాలా ఆనందంగా ఉంటుంది...
అయిపోగానే షరా మామూలే...
ఎలా శివా నిత్యం నిమిష నిమిషం నిన్ను దర్శించేది...
మహాదేవా శంభో శరణు...

శివోహం

మనకు అన్నీ భగవంతుడే ఇస్తే
ఆయనకు మనమేమి ఇవ్వగలం
అలాగని ఏమీ ఇవ్వకుండా ఉంటే
కృతజ్ఞత అవుతుంది కదా !
తల్లిదండ్రులు మనకు ఎన్నో ఇచ్చారు
మనం అనుభవిస్తున్న జీవితం
వారు అనుగ్రహించిందే
ఇంక వారికేమి ఇవ్వగలం
అలాగని వదిలేయలేం కదా !
వారియెడల భక్తిని కలిగి ఉండాలి
మనం ఏ చిన్న సేవ చేసినా
మురిసిపోతారు తల్లిదండ్రులు
భగవంతుడుకూడ అటువంటి
అల్పసంతోషియే ఏ కొంచెమిచ్చినా
పరమానంద పడిపోతాడు
అటువంటిది మననే కానుకగా
సమర్పిస్తే ఎంత మురిసిపోతాడు
అంటే బ్రహ్మస్మి అనే భావంతో
నీవే నేననుకో అనే భావాన్ని
వ్యక్తం చేయడమే నిజమైన కానుక

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...