దేవుడిచ్చిన అద్భుతమైన, అపురూపమైన, అందమైన మనుష్యజన్మ ను విజ్ఞానాన్ని సార్ధకం చేసుకోవాలి...
అలసత్వం కలుగకుండా అనుక్షణం జాగ్రత్త పడుతూ ఉండాలి అప్రమత్తంగా ఉండాలి...
మనలో అంతరంగంలో నిద్రాణం గా ఉన్న అంతరాత్మ అసలు స్వరూపాన్ని,అది అందించేపరమార్ధాన్ని గ్రహిస్తూ గుండెల్లో దైవభక్తిని చెదరకుండా నింపుకోవాలి...
విశ్వశ్వరుణ్ణి నిర్మల హృదయంతో ధ్యానిస్తూ వేడుకోవాలి ఆర్తితో ఆక్రోశించాలి...
అందుకు కావాల్సిన శక్తినీ, బుద్దీని స్పూర్తిని అనుగ్రహించమని ప్రార్తించాలి కూడా...
మనం అనుభవిస్తున్న కర్మఫలం తో బాటు ఈశ్వరుని కృపను, వివేకాన్ని, కరుణించమని కోరుకుందాం....
No comments:
Post a Comment