Saturday, April 3, 2021

హరే క్రిష్ణ

కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?
సమాధానం;- ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.
 చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో  ఉండిపోవలసిందేనా? 
లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే  గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. 
అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు
అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది. 
మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.
రెండోది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.
మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. 
ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి? 
ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పు, చాలు. 
 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
 పై త్రివిధ త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంబించాలి.

Friday, April 2, 2021

శివోహం

శంభో!!!పశు పక్షాదులు నీ సన్నిధి లో...
పశుపతినాథుడవని  తెలిసి పరవసించేను...
ఓ పశువుగా నేను నీ పదము చేరనీ...
నన్ను కూడా నీ పశువుల కొట్టాంలో కట్టేసుకోరాద...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మనిషి సర్వజ్ఞుడు కాదు తప్పు చేయడం సహజం...
ఎంత జ్ఞాని యైన తప్పు చేసేందుకు అవకాశం వుంది...
తప్పులన్ని తెలియక చేసేవే యెవరైన సత్యం చెప్పాలంటే దైవం దృష్ఠిలో అందరు క్షమార్హులే...
కనుక ఏ మనిషి క్షమా హృదయం కలిగి వున్నాడో, అతడు ధన్యుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

మూలశక్తివి నీవమ్మా…...
ఇచ్చాశక్తివి నీవమ్మా…....
జ్ఞానశక్తికి మూలం నీవమ్మ....
బ్రహ్మ… విష్ణు… శివులనడుపు పరాశక్తివి నీవమ్మా..
ఆది మాతృమూర్తివి 
సర్వలోకాలు పాలించు ఆది శక్తివి
ప్రకృతిమాతవు
అడిగినవారికి లేదనుకుండా భిక్ష ప్రసాదించు మాతవు
అన్నపూర్ణవు
సర్వుల బాధలనుతీర్చి కోర్కెలను నెరవేర్చు మాతవు
దుష్టులను శిక్షించి
సజ్జనులను కాపాడు మాత
పాడి పంటలను కాపాడి
సమృద్ధిగ నీయవే మా అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ

అమ్మ దుర్గమ్మ శరణు...

శివోహం



*మనము చేసే - కర్మకు బాధ్యులు - ఎవరు???...*

ఈ విషయంలో మానవునికే కాదు, జగజ్జనని అయిన పార్వతీ దేవికి కూడా అనుమానం కలిగింది...

ఒక రోజు పార్వతీదేవి ఈశ్వరుని తో... 
మానవులు కర్మలు చేస్తుంటారు కదా.. ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా?.. లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా అని అడిగారు... 

*అప్పుడు పరమశివుడు ఇలా చెప్పారు...*

పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు, దేవుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే... కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. 
మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు, ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే...
ఇందులో దైవప్రమేయము ఏదీయు లేదు, పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు...

మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే, ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయత్నములు...

"ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది, దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది."

నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. 
అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది, అలాగే ఏ పనికైనా పురుషప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు...

_కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పక కావాలి, అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు..._

                        *శుభమస్తు*
    

Thursday, April 1, 2021

శివోహం

అనేకజన్మలపరంపరలగా కొనసాగుతున్న బహుదూరపు బాటసారిని నేను.
నా గమ్యం ఆ సదాశివుని స్థానం.
దారిలో బహుదారులలో ప్రయాణించేవారు తారసపడుతుంటారు.
నా లక్ష్యం ఆ సదాశివుని జేరుటయే...
ఆతర్వాత సదా తోడు నీడా ఆ సదాశివుడే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

జీవితం లో అశాశ్వతమైన....
తల్లీ, తండ్రి , భార్యా, భర్త, పిల్లలు, స్నేహితులు ,బందువులు ఎందరో అపరిచితులను , అభిమానులను నమ్ముతున్నాను కానీ...

శాశ్వతమైన పరమాత్ము డైన నిన్ను మాత్రం నమ్మలేక
నిన్ను చేరి కొలువలేకునన్ను...
మంద బుద్ధి కలవాణ్ణి మన్నించు పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...