Friday, May 7, 2021

శివోహం

తాను గరళాన్ని మింగి  లోకానికి అమృతం దక్కించిన ఈ నీలకంఠుని  నెత్తిన నీళ్లు కుమ్మరిస్తే చాలు...
మెచ్చి వరాలు కురిపించేస్తాడు....
దోసెడు నీళ్ల అభిషేకం, చిటికెడు బూడిద అలంకారం, కూసిన్ని బిల్వపత్రాలు, కాసిన్ని ఉమ్మెత్తపువ్వులు, 'శంభో శంకర శరణు శరణు' అన్న స్మరణకే పొంగిపోతాడు బోళాశంకరుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, May 6, 2021

శివోహం

*నమ్మకం - విశ్వాసాలకు - ఉన్న తేడా ఏమిటి???*
ఈరోజు చాలామంది నమ్మకం - విశ్వాసం ఏదయినా ఒక్కటే, తేడా ఏమీ అని భావిస్తారు, కానీ చాలా వ్యత్యాసం ఉంది, అదేమిటో ఒకసారి పరిశీలిద్దాం...
ఒకచోట ఎత్తయిన రెండు భవనాల మధ్య ఒక బలమైన తాడు కట్టబడి ఉంది, దాని మీద ఒక వ్యక్తి నడుస్తున్నాడు,
వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవసాగాడు. 
చేతిలో ఒక పొడవయిన కర్ర పట్టుకున్నాడు, భుజాన అతని కొడుకు ఉన్నాడు, అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.... చాలా ఆతృతగా...
అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు, అందరూ చప్పట్లు కొట్టారు, కేరింతలతో ఆహ్వానం పలికారు, ఫోటోలు వీడియోలు తీసుకున్నారు...
“నేను ఈసారి ఇదే తాడు మీద నుండి తిరిగి అవతలికి వెళ్లాలనుకుంటున్నాను వెళ్లగలనా?” అని అతను ప్రశ్నించాడు...
వెళ్లగలవు, వెళ్లగలవు! అని జనం సమాధానం పలికారు...
నా మీద నమ్మకం ఉందా మీకు అని మళ్ళీ ?
ఉంది...ఉంది, మేం పందానికి అయినా సిద్దం అన్నారు!! 
అయితే మీలో ఎవరయినా నా భుజం మీద ఎక్కండి, అవతలకి తీసుకు పోతాను అని అన్నాడు!! 
అక్కడంతా నిశబ్దం, జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు! ఉలుకు లేదు, పలుకు లేదు!
*నమ్మకం వేరు, విశ్వాసం వేరు...*
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి...
ఈరోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇక్కడే... 
దేవుడు అంటే నమ్మకమే, పూజలు, భజనలు, సేవలు, అన్ని తెగ చేస్తాము, కానీ ఆయనపై విశ్వాసం లేదు...
మరి ఆయన నిన్ను ఎలా కాపాడేది???, 
ఈ జన్మనిచ్చిన భగవంతుని పైన్నే విశ్వాసం లేనప్పుడు ... ఆయన నీకు ఏమి చేయగలడు,
*భగవంతునిపై మనకు పూర్తి విశ్వాసం కలిగినప్పుడే దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతుంటాడు...*

శివోహం

శంభో!!!
శిరము వంచి ప్రణమిల్లి మిమ్ములను యాచిస్తున్నాను...
చావు పుట్టుకల చక్రబంధం లో చిక్కుకున్న నా మదిలో
జన్మ జన్మకు ని పాదపద్మములు స్థిరంగా వుండునట్లు
అనుగ్రహించుము చాలు...
అన్య కోరిక ఏమి కొరను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

కనబడడం లేదా...
వినబడడం లేదా...
సామాన్య మానవుల ఆర్తనాదాలు...
మబ్బులచాటున సూర్యుడు...
గుండెల మాటున మానని గాయాలు...
కాలుతున్న చితిమంటలు...
చితిమంటల మాటున ఆవిరౌవుతున్న రక్తాశ్రువులు
ఘోషిస్తున్న ఆత్మలు...
తల్లడిల్లుతున్న పేగు బంధాలు...
ఇంకా ఎన్నాళ్లు తండ్రి ఈ మృత్ర్యుఘోస...
నీకు కనబడడం లేదా...
నీకు వినబడడం లేదా సర్వేశ్వరా...
త్రినేత్ర దారి నీవే కదా సకల జనులను రక్ష...
పాహిమాం ప్రభో పాహిమాం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఉన్నది ఒక్కడే దేవుడు ఆది దేవుడు...
శివుని ప్రదక్షిణలలో ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో కనిపిస్తాడు పరమ శివుడు...
శిఖరముగా తానున్నా తనలో సర్వమూ ఇముడ్చుకున్నాడు...
శంభో అన్ని రూపాలలో నిన్నే తలంచు చున్నాను...

మహాదేవా శంభో శరణు..

శివోహం

*మానవుని మూడు కోరికలు.....*

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు...

అనాయా సేన మరణం, వినా దైన్యేన జీవనమ్ |
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే ||

ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం... ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.

మొదటిది...

ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.

రెండవది...

బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.

మూడవది...

అంతిమ లక్ష్యం, జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి.. చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.

ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి , ఆరాధించేవారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు...

*|| ఓం నమః శివాయ ||*

శివోహం

విధి అంటూ  ఏదీ లేదు 
       

మన జీవితం మన ప్రారబ్ద 
మన కర్మల పర్యవసానమే   !!
ఈ విధంగా మనమే మన కర్మలను
రూపొందించుకొంటున్నామంటే
వాటిని నశింపచేసుకోవడమూ
మనకు సాధ్యమే అన్నది నిజమే కదా  ? "

గొంగళిపురుగు తన దేహంనుండి స్రవించే
పదార్థంతో తన చుట్టూ తానే గూడు
కట్టుకొని దాన్లో తానే బంధీ అవుతోంది  
అక్కడే ఉంటూ అది
రోదించవచ్చు  ఆక్రోశించవచ్చు 
కాని దాని సహాయానికి
ఎవరూ రారు 

చివరకు అదే జ్ఞానం పొంది అందమైన
సీతాకోక చిలుకలా బయటకు వస్తుంది

ప్రపంచిక బంధాలకు సంబంధించిన
మన పరిస్థితీ ఇదే  .........

యుగయుగాలుగా మనమూ
జనన మరణ చక్రంలో తిరిగివస్తున్నాం
ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నాం 
మనం బందీగా ఉండడం గురించి
విలపిస్తూ దొర్లుతున్నాం
కాని  ఏడ్వడం వలనా
వాపోవడం  వలనా
ఏం  ప్రయోజనం లేదు

ఈ బంధాలను చేధించడంలో
మనం అకుంఠిత ప్రయత్నం చేయాలి అన్ని బంధాలకు ముఖ్యకారణం - అజ్ఞానం  

మనిషి స్వభావరీత్యా
దుష్టుడు కాడు  ఏనాడు కాడు
అతడు స్వభావరీత్యా పవిత్రుడు
పూర్తిగా  పావనమైన వాడు
ప్రతి మనిషీ దైవాంశసంభూతుడు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...