Thursday, September 2, 2021

అమ్మ దుర్గమ్మ

దేవతల గణములకు నాయకివి...
శర్వుని ఇల్లాలివి...
పర్వతరాజుకి ముద్దుల కూతురివి...
ఇక నా లౌకిక , ఆధ్యాత్మిక జీవనాన్ని నడపలెకుండా నా మదిని నీ శరణుజొచ్చాను...
దేవతలు , దానవుల  యుద్ధ రంగములో నీ శౌర్యము తిరుగులేనిది...
నీ గాంభీర్యము సముద్రము వంటిది...
నీ స్వరము కొకిల దేవతలను మించినది...
ఇక పరితాపము ,విరహము తాళలేకపొతున్నాను ఓ మంచి పనులు చేయించు...
అమ్మ మాయమ్మ దుర్గమ్మ శరణు.

Wednesday, September 1, 2021

ఓం గం గణపతియే నమః

పార్వతి పుత్ర...
శంబు తనయ...
ఆది పూజ్యుడా....
ఎలుక వాహనుడా...
కుక్షి నిండ నీకు కుడుము లిడుదు....
కరిముఖ గణపయ్య కాపాడు కరుణతో...
అర్థితోడ కొలిచి విన్నవించు కొందు....
విఘ్న రాజ కరుణతో కాపాడు.....
సమస్త దేవతా సమూహము చేత పూజించ బడెడి దేవదేవా శరణు....

శివోహం

శంభో ... 
బాల్యము ఆటలమయము...
యవ్వనము ప్రలోభాలమయము...
నిన్ను తలవని మనస్సును మన్నించి...
నిన్ను తెలియని బుద్ధిని కరుణించు...
నీవే దిక్కని నీవే నిజమని శరణు వేడే నాలో భక్తిభావము రగిలేలా కలుగజేయవయ్య శివ...
నిన్ను తప్ప అన్యము ఎరగను...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!పాదాక్రాంతం అవుతున్నా పదిమందిలో
ఏకాంతం కోరుతున్నా నీ సన్నిధిలో
ఆసాంతం ప్రశాంతం నీ చెంతనే
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
నీవు కన్ను తెరచినానీ కనుసన్నలలోనే కదా
నేనున్నది...
నీ మౌనం నాకు దీవెనగా భావించి నా జీవన యానం
సాగిస్తున్నాను...
నా మేను వీడి నేను నీ కడకు చేరాలని....
నా యజమానివి నీవే కదా శివ ఆనతినీయాలి మరి...
బాడుగకు మరో దేహం చూసి పంపేది నీవే కదా మరి నా విషయంలో నీకెందుకు శ్రమ...
నీ గణంలో ఒకడిని చేసుకొని నీ వాడిగా మలచుకోవచ్చుగా పరమేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
యుగ యుగాల నుండి ప్రతీ దినం , ప్రతీ క్షణం నీ అనంత హస్తాలతో జగతిని సంరక్షిస్తూనే ఉన్నావు...
రాత్రీ పగలు మారుస్తూ సమస్త ప్రాణికోటి జీవనానికి మూల కారకుడవుతున్నావు...
పుట్టడం, బ్రతకడం,చావడం అంతా నీ అధీనంలొనే...
పరమేశ్వరా! నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవానికి...
నీ దయ లేకుండా మా మనుగడే లేదు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నా మౌనంలో శతకోటి సందేహాలు
నీ మౌనంలో అనంతకోటి సమాధానాలు
మౌనమే మోదమని మౌనంలో తెలియనీ
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...