Tuesday, January 4, 2022

శివోహం

 శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .


 శివా! కనిపించగ వీలుపడదంటావు
అనిపించటం నీ పనికాదంటావు 
మరి నాకు ఎలా తెలియ వస్తావు
మహేశా ..... శరణు.


 శివా!నీవైన విశ్వాన్ని ఈ కనుల చూస్తున్నా
విశ్వమైన నిన్ను చూడలేక పోతున్నా
చూపునీయవయ్యా...చూడనీయవయ్యా
మహేశా . . . . . శరణు .


 శివా!ఋబు గీతను విన్నాను
ఋజు మార్గము గన్నాను
ఋషిగా నన్ను మలచు కొన్నాను
మహేశా . . . . . శరణు .


శివా!ఒంటిగా నను పంపి వెంట నీవన్నావు
సత్య ధర్మముల వెంట సాగిపోమన్నావు 
తెలియలేదంటె శోధించమన్నావు
మహేశా ..... శరణు.


 శివా!ఈర్ష్యా ద్వేషాలు ఎదగనీకు
కామ క్రోధాలు  రగలనీకు
మధ మాత్సర్యాలు  సోకనీకు
మహేశా .... శరణు.



శివా!ఆగలేక సాగుతున్న కాలం
సాగ లేక ఆగివున్న నీకు వశము
కాదనగ ఎవరి వశము
మహేశా . . . . . శరణు.


శివా!గత జన్మ గురుతు రాదు
మరు జన్మ తెలియ రాదు
ఏమిటో ఈ జన్మ యాతన .
మహేశా . . . . . శరణు .

Monday, January 3, 2022

శివోహం

మనసు బాలేదు అనే మాట అబద్ధం...
మనసును మనం సంతోషంగా పెట్టలేదు అనేమాట నిజం...

ఓం నమః శివాయ

Sunday, January 2, 2022

శివోహం

అమ్మ ఒడినుండి...
పలకాబలపం పట్టి...
నాన్న చేయిపట్టుకుని నడిచిన...
నాకు మంచి స్నేహితుడుగా పరిచయం...
అయి అన్ని వేళలా ఆదుకొంటూ కాపాడే ఓ పరమేశ్వరా 
నాకు నీవిచ్చిన సంపద సంతృప్తి
ఈ జన్మకు ఇది చాలు పరమేశ్వరా...
ఇక నన్ను నీ దరికి చేర్చుకో...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో
ఏ కోరిక కొరను నిన్ను...
నిన్ను భజించి...
నిన్ను పూజించి...
నీకు అర్చించి...
నిన్ను సేవించి తరించే మహాభాగ్యాన్ని ఈ జీవునికి ప్రసాదించు తండ్రి...
నీవే తప్ప నాకు వేరే దారి లేదు తండ్రీ.
మహాదేవా శంభో శరణు.

Saturday, January 1, 2022

శివోహం

సకల భూతనాధుడు...
తారక బ్రహ్మస్వరూపుడు...
గిరీశుడు...
పార్వతినందనుడు...
పరమేశ్వర పుత్రుడు...
సర్వపాపములను నాశనము చేయువాడు శ్రీ హరిహారపుత్ర అయ్యప్ప శ్రీ ధర్మశాస్తాను నేను నమస్కరించు చున్నాను...

ఓం శ్రీ స్వామియే శరణు.
ఓం నమః శివాయ.

శివోహం

అందరూ భగవంతుని పిల్లలే...
భగవంతుడు తన పిల్లలందరినీ ప్రేమిస్తాడు...
నేను భగవంతుని ప్రేమించాలనుకుంటే
ఆయన ప్రేమించేవారందరినీ ప్రేమించడం నేను నేర్చుకోవాలి...

*Radhanath Swami*

Friday, December 31, 2021

శివోహం

నీది కాని నీ తనువుని చూస్తూ...
మురిసిపోతూ తడబడి పోతూ...
తమకపు కన్నుల చప్పుడు చేస్తూ...
తప్పులు చేస్తూ తిప్పలు పడుతావు ఎందుకు జీవా.. మహాదేవుడి పాదాలు పెట్టుకో కలిమయా నుండి తప్పించుకో...

ఓం నమః శివాయ.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...