Thursday, January 20, 2022

శివోహం

శివా!పంచభూతాలలో నీవు                                        పంచభూతాలతో నేను
కూడి వున్నాము జత కూడి వున్నాము                        మహేశా . . . . . శరణు.

Wednesday, January 19, 2022

శివోహం

శంభో...
నిండు మనసుతో నిన్ను అభిషేకించ పంచపాత్రడు జలములో ఉద్దరిణెతో పంచాక్షరీ మంత్ర స్మరణమున శిరముపై ధారపోయగానే భక్తుని నోట నీ మాట విని పరుగున వస్తవు అంట కదా...
రెండు ధారల అభిషేకాలు కన్నా భక్తుల పంచాక్షరీ అభిషేకాలకే పులకరించేవు కదా...

మహదేవా శంభో శరణు.

శివోహం

 శివా!మంచు కొండలు కాస్త వీడి రావయ్యా
వెచ్చనైన నా గుండెలో విడిది చేయవయ్యా
వాసయోగమే నీకు వచ్చి చూడవయ్యా
మహేశా  . . . . . శరణు.


శివా!నర జన్మమొస్తే నాయనారు నవుతా
ఇతర జన్మమైతే  శ్రీకాళహస్తి గుర్తెరిగిస్తా
ఏ జన్మమైనా  నీ ధ్యాసలోనే
మహేశా . . . . శరణు .


శివా!నీ పాద ధూళిగా పరవసించేను
భస్మమై నేను, నీ దేహాన భాసించేను
భాగ్యమే నాదిగా భవపాప హరా
మహేశా . . . . . శరణు .


శివా!జల్లెడ లాంటి జడల మధ్య
జారుతున్న గంగ నెటుల బంధించావు
జలము జడమయ్యిందా జగధీశా
మహేశా . . . . . శరణు


శివా! నా పాప పుణ్య ఫలములు
సుఖ దుఃఖ రూపాన నిశ్శేషంగా
వ్యయమనీ నీలో లయమవనీ
మహేశా . . . . . శరణు

శివోహం

జీవితం అంటే  లక్షలు, కోట్లు సంపాదించడం ఒక్కటే  కాదు...

మన మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో అక్కడ గడపటం...

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, January 18, 2022

శివోహం

శంభో!!! పొట్టని గుండె క్రింద ఏర్పాటు చేసి...
ఆ గుండె ఉండేది గుప్పెడే కానీ ...
ఆ గుండెకు నాలుగు గదులు చేశావు
(తల్లిదండ్రులు, ఆలుబిడ్డలు, బంధుమిత్రులు, శివకేశవులు)...
నేను కూటికి పేదవాడినే కాని నిన్ను పూజించుటలో కాదు...
నువ్వు నాకిచ్చినదే నీకు ఇస్తున్నానని చిన్నచూపు చూడకు...
నేను నీ వాడిని నీకు ఒంటికి సరిపడా భస్మం ఇస్తా కదా...

మహాదేవా శంభో శరణు...

Monday, January 17, 2022

శివోహం

పగలు రేయి రెండూ నీవే తండ్రి...
ఉదయాన నేపడే కష్టాలకు గొడుగువు నీవే...
నేను తినే అన్నపానాదులు నీభిక్షయే...
కడుపు నిండిన వేళ కనులు మూసుకుపోయి
సాయం చేసిన నిన్నే మరచి నిదరోతున్నా
నన్ను మన్నించు శంభో...

మూడుపూటల ముక్కంటివి నీవని ఎరుగక నేచేసిన తప్పిదాలు మన్నించి చీకటి వెలుగుల కాపాడవా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

సృష్టి, స్థితి, లయాలకు...
మూల భూతుడైన ఆది దేవుడొక్కడే...
దేవదేవుడు శివుడొక్కడే....
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...