శివా!మంచు కొండలు కాస్త వీడి రావయ్యా
వెచ్చనైన నా గుండెలో విడిది చేయవయ్యా
వాసయోగమే నీకు వచ్చి చూడవయ్యా
మహేశా . . . . . శరణు.
శివా!నర జన్మమొస్తే నాయనారు నవుతా
ఇతర జన్మమైతే శ్రీకాళహస్తి గుర్తెరిగిస్తా
ఏ జన్మమైనా నీ ధ్యాసలోనే
మహేశా . . . . శరణు .
భస్మమై నేను, నీ దేహాన భాసించేను
భాగ్యమే నాదిగా భవపాప హరా
మహేశా . . . . . శరణు .
శివా!జల్లెడ లాంటి జడల మధ్య
జారుతున్న గంగ నెటుల బంధించావు
జలము జడమయ్యిందా జగధీశా
మహేశా . . . . . శరణు
శివా! నా పాప పుణ్య ఫలములు
సుఖ దుఃఖ రూపాన నిశ్శేషంగా
వ్యయమనీ నీలో లయమవనీ
మహేశా . . . . . శరణు
No comments:
Post a Comment