Friday, May 20, 2022

శివోహం

కర్మానుసారముగా నడుస్తూ నా మదిలోని 
తలపులను...
కష్టాలను నీతో చెప్పుకుంటున్నాను..
కనుపాపగా నీవే నా చెంత ఉండి నా గమ్యం ఏమిటో తెలియపరుస్తున్నావు...
తండ్రి నీవు కృపసాగారుడిని...

ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా.

శివోహం

మట్టితో బొమ్మను చేసి...
మనిషిగా ప్రాణకు పోసి...
బంధానికి బంది చేసి...
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము,సర్వమూ శాశ్వతం అనే మాయను
పెంచి...
ఈ మాయ అనే ప్రాణం తీసి....
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా శివయ్యా..
ఈ జీవుడుని ఇన్ని ఆటలు ఆడిస్తూ ఏమి తెలియని అమాయకునిలా ఎట్టా  కూర్చునావయ్యా...
నీకు నీవే సాటి వెరెవ్వరయ్యా...

మహాదేవా శంభో శరణు...

Thursday, May 19, 2022

శివోహం

దైవభక్తితో ప్రపంచాన్ని మరచిపోవలి...
అంతేగానీ...
ప్రపంచాన్ని చూస్తూ దైవభక్తిని మరచిపోకూడదు...
మనం ప్రపంచంలో ఉండాలి కానీ మనలో ప్రపంచంలో ఉండకూడదు...
పడవ నీళ్లలో ఉండాలి కానీ పడవలో నిల్లుండకూడదు...
జ్ఞాని తాను చేసింది, చేయనిది, చేయవలసింది వాటి గురించి చితించడు...
అంటే జ్ఞాని తాను చేసే కర్మకు తాను కర్తను అని గాని, చెయ్యని దానికి అకర్తను అనిగాని  భావించడు....
కర్మలో అకర్మగా ఉంటాడు..
అకర్మలో కర్మగా ఉంటాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

జీవుడు(మనం) ఎప్పటికి ఒంటరివాడే ! 
 జాృగృ,స్వప్నాతావత్సలో వుండేంతవరకే వాడు అఙ్ఞానంతో తోడుకోసం తపిస్తాడు.సుసుక్తావత్సలో వాడి ఉనాకే కోల్పోతాడు అప్పుడు వాడి కళల(కల్పనల) సామ్రాజ్యానికి వాడే కర్త(బ్రహ్మ) కర్మ(విష్ణు)  లయ(రుద్రుడు)
వాడికి అన్యంగా కించిత్ కూడ ఉండదు.ఆవిషయాన్ని జాగృత్ లో ఉన్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే  మానవుడు మాధవుడౌతాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

జీవుడు(మనం) ఎప్పటికి ఒంటరివాడే ! 
 జాృగృ,స్వప్నాతావత్సలో వుండేంతవరకే వాడు అఙ్ఞానంతో తోడుకోసం తపిస్తాడు.సుసుక్తావత్సలో వాడి ఉనాకే కోల్పోతాడు అప్పుడు వాడి కళల(కల్పనల) సామ్రాజ్యానికి వాడే కర్త(బ్రహ్మ) కర్మ(విష్ణు)  లయ(రుద్రుడు)
వాడికి అన్యంగా కించిత్ కూడ ఉండదు.ఆవిషయాన్ని జాగృత్ లో ఉన్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే  మానవుడు మాధవుడౌతాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, May 18, 2022

శివోహం

దుఃఖాలు,పాపలు,కష్టాలు....
సమస్యలు భయంకర పరిస్తుతులు....
మానుండి తీసివేయవయా మహశివ....
సర్వం నీవే అని నిన్ను నమ్ముకున్న....
నీవు తప్ప మాకు దిక్కు వేరెవరు....
నీ యేుక్క కృపకటాక్షాలు ఎల్లవేళలా....
మా పై ప్రసహింప చేయవయా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

చెట్టు మీదకి పక్షి వచ్చి వాలితే ఆ  పళ్ళని తిని గూడు కట్టుకుని పిల్లల్ని కనీ అవి పెరిగి పెద్దవై రెక్కలొస్తే
గూటిని వదిలి వెళ్ళిపోతాయి.
అంతే  కానీ పిల్లల కోసం ఎదురు చూడదు.
పక్షి ఇంకో చెట్టు మీదకి వెళుతుంది.
జీవుడు కూడా ఎదో  ఒక  దేహంలోకి
వస్తాడు కర్మ ఫలాలను అనుభవిస్తాడు.
ఋణాను బంధ రూపేణా ధారా పుత్రులు వస్తారు ఋణం తీరిపోగానే వెళ్ళిపోతారు
కానీ మనుషులు  బాధపడుతుంటారు అయ్యో వెళ్లిపోయావా అని ఇదంతా కంచి గరుడ సేవ.
విత్తనాన్ని కాలిస్తే మొలవదు...
మనస్సుని జ్ఞానంతో అభ్యాస వైరాగ్యాలతో కాలిస్తే జన్మ ఉండదు.

ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...