Sunday, May 22, 2022

శివోహం

ఎద్దు వాహనమెక్కి ఏడేడు లోకాలు ఎట్టాగ తిరిగావు శివ...
ఎట్టాగ కుదిరేను నీకు...
మాకు ఎరుక కాకున్నాది...
ఏమేమి చూసావో...
నీవు ఏమేమి చేసావో కానీ...
ఏడ చూసిన నీవే...
ఏమి చేసిన నీవే...

మహాదేవా శంభో శరణు.

శివోహం

చరాచర ప్రపంచమంతా ఒక పిచ్చాసుపత్రి లాంటిది...
ఇక్కడ జీవులన్నీ  పిచ్చివారే...
ఒకరికి అన్నమంటే పిచ్చి...
ఒకరికి   కన్నమేయడమంటే పిచ్చి...
ఒకరికి భక్తియంటే  పిచ్చి...
ఒకరికి  మత్తు అంటే పిచ్చి..
ఒకరికి  కాంతలంటే పిచ్చి...
ఒకరికి   కనకమంటే పిచ్చి...
ఒకరికి  ఆటలంటే పిచ్చి...
ఒకరికి పాటలంటే పిచ్చి...
వైద్యుడే సద్గురువు సేవచేసేవారే బంధువులు ఎవరిపిచ్చి వారికీ ఆనందం వెర్రిముదిరి గంగ వెఱ్ఱిలెత్తినపుడే వెర్రిమర్రి వేదాంత విద్య తెలియు...
వెఱ్ఱిలేనివాడు వేదాంతి కాడయా వెర్రివెంగళరాయ ప్రసాదయ్యా...

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, May 21, 2022

శివోహం

నారసింహ స్వామీ...
నీ సాక్షాత్కారము సకల పాప హరణం...
నీ దర్శనం భవరోగ నివారణం...
నీ స్మరణం పూజనం ,సేవనం , జన్మ జన్మల పుణ్యఫలం...
శ్రీమన్నారాయణ భయంకర మహోగ్ర లక్ష్మీ నరసింహ నీవే శరణు.

శివోహం

జీవితమంటేనే సుఖదుఃఖాల సంగమం....
బంధాలు అనుబంధాలు, ఆత్మీయతలు, ఆనందకర అనుభూతులతో పాటు...
ఎన్నెన్నో అవరోధాలు, అవహేళనలు, ఆవేదనలతో కూడిన ప్రయాణమే జీవితం....
అందరి జీవితగమనంలో ఎత్తుపల్లాలు సహజం.... వాటినుంచి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలం...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, May 20, 2022

శివోహం

కర్మానుసారముగా నడుస్తూ నా మదిలోని 
తలపులను...
కష్టాలను నీతో చెప్పుకుంటున్నాను..
కనుపాపగా నీవే నా చెంత ఉండి నా గమ్యం ఏమిటో తెలియపరుస్తున్నావు...
తండ్రి నీవు కృపసాగారుడిని...

ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా.

శివోహం

మట్టితో బొమ్మను చేసి...
మనిషిగా ప్రాణకు పోసి...
బంధానికి బంది చేసి...
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము,సర్వమూ శాశ్వతం అనే మాయను
పెంచి...
ఈ మాయ అనే ప్రాణం తీసి....
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా శివయ్యా..
ఈ జీవుడుని ఇన్ని ఆటలు ఆడిస్తూ ఏమి తెలియని అమాయకునిలా ఎట్టా  కూర్చునావయ్యా...
నీకు నీవే సాటి వెరెవ్వరయ్యా...

మహాదేవా శంభో శరణు...

Thursday, May 19, 2022

శివోహం

దైవభక్తితో ప్రపంచాన్ని మరచిపోవలి...
అంతేగానీ...
ప్రపంచాన్ని చూస్తూ దైవభక్తిని మరచిపోకూడదు...
మనం ప్రపంచంలో ఉండాలి కానీ మనలో ప్రపంచంలో ఉండకూడదు...
పడవ నీళ్లలో ఉండాలి కానీ పడవలో నిల్లుండకూడదు...
జ్ఞాని తాను చేసింది, చేయనిది, చేయవలసింది వాటి గురించి చితించడు...
అంటే జ్ఞాని తాను చేసే కర్మకు తాను కర్తను అని గాని, చెయ్యని దానికి అకర్తను అనిగాని  భావించడు....
కర్మలో అకర్మగా ఉంటాడు..
అకర్మలో కర్మగా ఉంటాడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...