Thursday, August 4, 2022

శివోహం

స్వేచ్ఛమైన నిశ్చల జలములో ప్రతిబింబం దూలింలేని దర్పణములో ముఖం నివురు కప్పనప్పుడు నిప్పు మబ్బు తొలిగినప్పుడు సూర్యుడు స్పష్టంగా కనిపించదు 

అలాగే 
శుద్ధమైన భక్తికి నిచ్చలమైన బుద్ధికి 
పరమాత్మ స్పష్టంగా దర్శనమగును 
నిర్మలమైన మనస్సులో దేవుడు సాక్షాత్కరించును.

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, August 3, 2022

శివోహం

అహం పెరిగితే రాగద్వేషాలు 
అహం తరిగితే ప్రేమానందాలు 

అహం ఆకాశమైతే ద్వైతం 
అహం నశించితే అద్వైతం 

కానీ స్వామి నీ దయ ఉంటె 
అహం నిలబడితే పరబ్రహ్మనికి సేవలు 
అహం పడిపోతే అంత పరబ్రహ్మ స్వరూపాలు.

ఓం శివోహం... సర్వం శివమయం.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

బరువును తగ్గించుకుంటే సులువుగా దాటగలము బరువు పెరిగే కొద్దీ దాటడం కష్టం...
బంధింప పడతాము...
వదిలించుకోని ఒడ్డున పడాలె కానీ తగిలించుకుని తంటాలు పడకూడదు...
అడవి నుంచి కట్టెలు కొట్టి మోపు కట్టి మోసుకొని వస్తున్నా వాడు ఎప్పుడెప్పుడు ఆ కట్టెల మోపును దించుదామా అని పరిగెత్తుకుంటూ వచ్చి పడేస్తాడు...
అలాగే ముముక్షువైనవాడు ఈ దేహాన్ని కట్టెల మోపులా ,ఒక వస్త్రంలా  చూడాలి కానీ దాని మిద మమకారం పెంచుకోవద్దు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, August 2, 2022

శివోహం

డబ్బున్న వాడు పాలు పోస్తాడు...
మధ్య తరగతి వాడు నీళ్లు పోస్తాడు...
పేదవాడు దండం పెడతాడు...
ఎవరు ఎలా పూజించిన అందరిని ఏ బేధం లేకుండా ఓకే లాగా తన లో కలుపుకుంటాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, August 1, 2022

శివోహం

మన ఆప్తులు,ఆప్తమితృలు అన్ని వేళలా మన వెంట ఉండరు...
మన సిరి సంపదలు మన వెంట రావు...
మన ఆలు బిడ్డలు సర్వవేళలా మనతోనుండరు...
మరి సర్వకాల సర్వావస్థలయందు మన వెంటనుండు ఆ భగవంతుని మీద ధ్యాస పెట్టక అశాశ్వతమైన విషయాల మీదనే సదా ఆలోచించుట ఎంత వరకు సమంజసము ఆత్మ బంధువా.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

నా నుదుటి గీతలు వ్రాసినా దేవా దేవుడివి నీవు...
వ్రాసినవి చేరిపి తిరిగి వ్రాయగలిగినది నీవే చదవగలిగేది నీవే పరమేశ్వరా...
నా నుదుటి వ్రాత నీచేతి రాత ఎలా ఉందో చూసుకో నన్ను కాచుకో సర్వేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నా నుదుటి గీతలు వ్రాసినా దేవా దేవుడివి నీవు...
వ్రాసినవి చేరిపి తిరిగి వ్రాయగలిగినది నీవే చదవగలిగేది నీవే పరమేశ్వరా...
నా నుదుటి వ్రాత నీచేతి రాత ఎలా ఉందో చూసుకో నన్ను కాచుకో సర్వేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...