Tuesday, September 13, 2022

శివోహం

శంభో...
నా తప్పటడుగులను సరిచేసి...
నీ ముంగిట కట్రాడుకు నన్ను కట్టేయవా...
బాల్యచేష్టల నేను చేసిన ఇంకా చేస్తున్న...
పాపాల మూట ముడివిప్పి కాటిలో కాల్చి బూడిద చేసి హరించివేసి నీ కైలాసంలో నీ సన్నిధిలో ఓ మూల నన్ను కట్టేయవా
ఆ వేడి ఆవేదన మరచిపోతా
శివా! నన్ను చేరదీయవా...
మహదేవా శంభో శరణు.

Monday, September 12, 2022

శివోహం

ఈప్రపంచము నీవే మహదేవా...
ఇందులోని జీవ,నిర్జీవులు నీవే, తుది శక్తివీనీవే...
సగుణ, నిర్గుణ, నా తండ్రి, తల్లి నీవే...
ఓ పరమశివ నీవెంత గొప్పవాడివో వర్నించడానికి నేను చాలాసూక్ష్మజీవిని...
మహదేవా శంభో శరణు.

శివోహం

నీవే ఆకాశము 
నీవే ప్రకాశము
నీవే వాయువు 
నీవే ఆయువు 
నీవే అగ్నివి 
నీవే జ్యోతివి
నీవే జలము 
నీవే జగము 
నీవే ధాత్రివి 
నీవే ప్రధాతవి 
నీవే సూన్యము 
నీవే పూర్ణము 
నీవే సర్వము 
నీవే శరణ్యము
మహదేవా శంభో శరణు.

Sunday, September 11, 2022

శివోహం

ఏ నిమిషమును నీదియు కాదు కాదు ,
నిజము తెలిపితే బతుకంత నీది నీది
ఏ కలము రాత నీదియు కాదు కాదు
నిజము హృదయము పట్టితే నీది నీది

శ్వాస నుండివచ్చేది ఊపిరియు కాదు 
విశ్వ మంతయు ఉన్నను కాదు నీది 
కర్మ లన్నీయు మర్మాలు కాదు కాదు  
ధర్మ మంతయు సంపద కాదు నీది

నీస్వ రములు నీవియు కానె కాదు కాదు     
నిన్ను ఆవహించే శక్తి కాదు నీది     
సంప దంతయు కష్టఫలమ్ము కాదు    
ఉన్న దంతయు పొందేది కాదు నీది

నీకు మాత్రమే తెలిసింది కాదు కాదు 
నీకు ఉన్నట్టి ప్రేమయు కాదు నీది
నీవు చేసేవి నిజముగా కాదు కాదు 
నీవు పొందే సుఖములన్ని కాదు నీది

శివోహం

అవును ఏదో ఒక నాడు నేను నా శాశ్వత చిరునామాకు వెళ్లిపోతాను...

కానీ...

నలువైపులా మీరు చిందే నవ్వులలో తడిసిన చిరు జల్లుల్లా అందరికీ కనిపిస్తాను...

శివుడి వైపు మీరు ఎంచుకున్న గమ్యం వైపు సాగే మీ బాట లో తడబాటు లేని అడుగుల జాడలలో కనిపిస్తా నేను...

నలుగురికీ మీరు పంచె ఆనందాల ప్రతిబింబాలలో
నలుగురికి చేయందించిన మీ సాయం లో నిస్వార్ధం నేర్పిన ఉనికిని నేనై కనిపిస్తాను...

నిరాశలో మీరు నింగి కేసి చూస్తే మీ కోసం నేనుంటాను...
ఏ కష్టాన్ని మీరు లెక్క చెయ్యకుండా మిలో ధైర్యం నిండేలా చల్లని వెన్నెల పై కురిపించే చక్కని చందమామ నౌతా

నిజంగా కడవరకూ మిలో జ్ఞాపకంగా ఉంటాను...

అవును నిజంగా నేను ఏదో ఒకరోజు నా శాశ్వత చిరునామాకు వెళ్లిపోతాను....

Saturday, September 10, 2022

శివోహం

ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం...
ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు...
జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు ఓంకార దివ్యస్వరూపుడు గణనాథుడు.
సర్వ విఘ్నములను తొలగించే సిద్ది వినాయకుడు.  సత్వర శుభాలను ప్రసాదించే శుభంకరుడు విఘ్నేశ్వరుడు మీ అందరికి సకల సుఖాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ.

ఓం గం గణపతియే నమః.

Friday, September 9, 2022

శివోహం

వదలను కాకా వదలను...
పట్టిన నీ పాదం గట్టిగా పట్టుకుంటా...
పట్టు పట్టారాదు పట్టు విడవరాదు...
విడవకుండా పట్టుకుంటా...
నిన్ను విడిచి పోవాలని లేదు...
శివ గణం లో నన్ను ఒకడిగా తీసుకువెళ్లు...
ప్రదమపూజిత విగ్నేశ్వరా శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...