Sunday, January 1, 2023

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

కర్మానుసారముగా నడుస్తూ నా మదిలోని
తలపులను, కష్టాలను తెలుపు కుంటున్నాను.. 
కనుపాపగా నీవే నా చెంత ఉండి
నా గమ్యం ఏమిటో తెలియపరుచు శ్రీహరి...

ఓం నమో నారాయణ.
*ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం* సబ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

శివోహం

మోహిని బాల...
మోహనారుపా...
నీవే శరణు...

శివోహం

శివా!ఋబు గీతను విన్నాను
ఋజు మార్గము కనుగొన్నాను
ఋషిగా మలచు కొన్నాను
మహేశా . . . . . శరణు .

శివోహం

బాహ్య పరంగా 
నిన్ను ఎవరూ 
బంధించక పోవచ్చు ...

కానీ ...

అంతర్గతంగా 
ఆ ఆదిదేవుడు 
నిన్ను బంధిస్తూ
ప్రశ్నిస్తూనే ఉంటాడు ...

శివోహం  శివోహం

శివోహం

వాడి పోతున్న
మొక్కకు నీరు పోస్తే
బతుకుతుంది కానీ
ఎండిపోయిన మొక్కకు కాదు

కృంగి పోతున్న
మనసుకు చేయూతనిస్తే
కోలుకుంటారు కానీ
జీవచ్చవాలుగా మారినప్పుడు కాదు

బంధాలు
అనుబంధాలు కూడా
స్వార్ధ పూరితం ఐతే
మానవత్వం మరుగున
పడుతుంది

ఇంక దైవత్వం మాటెక్కడ?

జీవం ఉన్న మనుషుల్లో
దైవాన్ని చూడలేని నాడు
ఆ దైవం ఎక్కడా కనుపించదు 

శివోహం

మనిషికి మనిషే తోడనే విషయం...

మనిషి ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నప్పుడే తెలుస్తుంది.
*ఓం నమః శివాయ*

శివోహం

బుద్ధిబలము,యశస్సు,మనోధైర్యము. ఇవి దైవచింతన ద్వారానే సాధ్యమవుతాయి.

ఓం నమః శివాయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...