Tuesday, April 11, 2023

సమదృష్టి



హస్తినాపురంలో కౌరవులు, పాండవులు కొలువుదీరి ఉన్నారు. అదే సమయంలో ఒక మహర్షి కొలువుకు వచ్చాడు. అందరూ సాదరంగా ఆహ్వానించారు. అక్కడివారికి తనకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పసాగాడు మహర్షి. ఏది మంచో, ఏది చెడో, ఎవరు మంచివాళ్లో, ఎలాంటి వాళ్లు చెడ్డవాళ్లో వివరించాడు. ఆయన మాటలతో ఏకీభవించలేనట్టు ముఖం పెట్టాడు దుర్యోధనుడు. అప్పుడు మహర్షి ధర్మరాజుతో ‘నాయనా! నువ్వు ఈ నగరమంతా పర్యటించి ఒక చెడ్డవాణ్ని పట్టుకుని.. ఈ సభకు తీసుకురా!’ అన్నాడు.

దుర్యోధనుడితో ‘నువ్వు నగరంలో పర్యటించి ఒక మంచివాణ్నయినా తీసుకురా!’ అని చెప్పాడు. ఇద్దరూ సభ నుంచి బయల్దేరారు. సాయంత్రానికి ఇద్దరూ తిరిగి సభా సదనానికి చేరుకున్నారు. ‘ఇద్దరూ ఒంటరిగా వచ్చారేం?’ అని ప్రశ్నించాడు మహర్షి. అప్పుడు ధర్మరాజు ‘మహర్షీ! ఈ నగరంలో నాకు ఒక్క చెడ్డవాడూ కనిపించలేదు. అందరూ మంచివాళ్లే’ అన్నాడు. ‘నాకైతే ఒక్క మంచివాడూ తారసపడలేదు. అందరూ దుష్టులే!’ అన్నాడు దుర్యోధనుడు. మహర్షి చిన్నగా నవ్వి ‘మీ దృష్టిని బట్టి లోకం ఉంటుంది. ధర్మరాజు లోకమంతా మంచిదే అని భావించాడు. అందరిలో మంచినే చూశాడు. అందుకే


అతనికి చెడ్డవాడు కనిపించలేదు’ అన్నాడు. ఇంకా చెబుతూ ‘దుర్యోధనా! నీ దృష్టిలో ఈ లోకమంతా చెడ్డదే! అందుకే ఎంత వెతికినా నీకు మంచివాడు కనిపించలేదు’ అన్నాడు.  మనం నల్లని కండ్లద్దాలు పెట్టుకుంటే మన పరిసరాలు నల్లగానే కనిపిస్తాయి. తెల్లని సులోచనాలు ధరిస్తే.. లోకమంతా తెల్లగా కనిపిస్తుంది. మన దృష్టిని బట్టి ఈ లోకం ఉంటుంది. ప్రతీ వ్యక్తిలో మంచి-చెడు రెండూ ఉంటాయి. మనలోని చెడును జయించి మంచిగా మారడమే మనిషి కర్తవ్యం. అదే సమయంలో ఎదుటి వ్యక్తిలోని మంచిని గుర్తించడం సమదృష్టికి సోపానం.

… శ్రీ

Monday, April 10, 2023

శివోహం

భక్త సులభుడవు...
దీన బంధుడవు...
కారుణ్య అమృత దయాంత రంగుడవు...
గౌరీ మనోహర
పురహర హర హర
మహాదేవ హర శంభో శంకర
పాహి పాహి పరమేశ్వర.

Sunday, April 9, 2023

శివోహం

భగవంతునికి భక్తునికి భేదం లేదు....
జీవాహంకారం ఉన్నంత వరకు జీవుడిలో భేదభావం కొనసాగుతూ ఉంటుంది...
ఆ జీవాహంకారమనే అడ్డు తొలగించుకుంటే భగవదైక్యమె.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!నిత్యం నీ పదములు కొలుస్తున్నా
మా కంటికి ఏనాడు కాననీయవు
ఏనాడూ నీ పదము నంటనీయవు
మహేశా . . . . . శరణు .

Saturday, April 8, 2023

శివోహం

శివా!నా గమ్యానికి నీవే గురుతు
ఆ గురుతుకి నీవే షరతు
నా గమనంలో నీవే మలుపు
మహేశా . . . . . శరణు .

శివోహం

నాలోనే ఉన్న నిన్ను బయట కూడ చూడ గలిగితే...
చేసే పనులన్నీ నీవే చేయిస్తూ ఉన్నా వనుకుంటే...
నీకూ నాకూ బేధముండదు...
ఎవరితో ఏ తగాదా ఉండదు...
నిను వెదకే పని లేదు కదా శివ.

మహాదేవా శంభో శరణు.

Friday, April 7, 2023

హరే గోవిందా

మంగపతి నిన్ను చూడ వచ్చినామురా
ముడుపులన్ని మూటగట్టి తెచ్చినామురా
                                           " మంగ"
పిల్లా పాపలతోటి కొండ ఎక్కుచూ
అలుపైనా సలుపైనా నీకు మొక్కుచూ
గోవిందాని నీ నామం స్మరణ చేయుచూ
చేరినాము నీ గుడికి వేంకటేశ్వరా
                                           "మంగ"
బారులు తీరిన జనము చూడ బారెడు
వరుసలలో వేచియుండ గుండె జారుడు
నా కనులారా నీ రూపం చూడనీయరు
నిముషమైన ఆ గడపను నిలువనీయరు
                                       "మంగ"
వెనుతిరిగి నిను చూడ వేంకటేశ్వరా
ములుగుతోంది నా మనసు ఏమి సేతురా
వెనుక వారు వెన్ను తట్టి నెట్టి వేయగా
వెడలినాను నీ రూపం నెమరువేయుచూ
                                        "మంగ"

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...