Sunday, April 16, 2023

శివోహం

శివా!ఫలాపేక్షలు నాలో పటాపంచలవనీ
ఆపేక్షలు నాలో అంతమవనీ
నిటలాక్షా నేను నీలో లయమైపోనీ
మహేశా . . . . . శరణు .

Saturday, April 15, 2023

శివోహం

హనుమంతుడు మహా బలశాలి
మనసును మించి పయనించు ధీశాలి

జ్ఞానములోన జగతిని మిన్న
సంగీతమున సర్వులకు మిన్న
వాక్కులలోన వాగ్ధేవి సుతుడు
చేష్టలందున చెలిమికి హితుడు

కార్యశూరుడు కర్మ వీరుడు
కామ్యములన్నవి ఎరుగని వాడు
నిర్మల చిత్తుడు నిష్టా గరిష్టుడు
నింగిని నేలకు తేగల ధీరుడు

బ్రహ్మ వరమును పొందినవాడు
బ్రహ్మచర్యమున ఘనుడితడు
అందరి మన్నలందిన వాడు
ఆత్మ విశ్వాసమున అధికుడు ఇతడు

స్థిర చిత్తముతో మసలెడి వాడు
చిరంజీవిగా స్థిరమయినాడు
పూజలు చేసిన పూజ్యనీయుడు
రాగల యుగమున కాగల బ్రహ్మ

శివోహం

శివా!నీ సూర్య నేత్రము విరిసిందా వికాసము
నీ సోమ నేత్రము విరిసిందా అమృత వర్షము
నీ అగ్ని నేత్రము విరిసిందా జ్ఞానానందమే
మహేశా . . . . . శరణు .

Friday, April 14, 2023

శివోహం

భగవత్ సన్నిధికి చేరుకొనుటకు నామస్మరణ ఎంతటి ముఖ్యమో సేవలు కూడా అంతే ముఖ్యం. నామస్మరణ , సేవలు ఈ రెండూ రైలు పట్టాల వంటివి. కేవలం ఒక పట్టా మీదుగా పోతే రైలు తన గమ్యస్థానం చేరుతుందా?  రెండు పట్టాలు మీదుగా వెలితేనే గమ్యస్థానం చేరుకొగలదు. అదే విధముగా మనం భగవత్సన్నిధికి చేరుకోవాలంటే నామ స్మరణతో పాటు  సేవలు కూడా చేస్తుండాలి. అపుడే ప్రయాణం సులభమౌతుంది. శీఘ్రముగా భగవంతుని సన్నిధికి చేరుకొనుటకు అవకాశం ఉంటుంది.

ఓం నమో నారాయణ.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!నాకు స్మరణము నీవే
నాకు స్పురణయు నీవే
సకల దుఃఖ హరణమూ నీవే
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ దేవుడు గొప్పవాడా...
ఆ దేవుడు గొప్పవాడా...
లేదా దేవత గొప్పదా?  భక్తి మార్గం గొప్పదా...
ధ్యాన మార్గం గొప్పదా?
ఈ మంత్రమా ఆ మంత్రమా ఏది గొప్పది?
రాముడా... శివుడా... కృష్ణుడా... అమ్మవారా...
ఈ మీమాంస వద్దు...
అందరూ  ఏకదైవమైన పరబ్రహ్మ వ్యక్తరూపాలే...
ఏ రూపంలో కొలిచినా దేవుడు ఒక్కడే...
అలానే, అన్ని మార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం మార్గ నిర్దేశం చేసినవే...
అన్ని భగవంతుని అనుగ్రహసారం వచ్చినవే...
ఏది ఎక్కువా కాదు, ఏది తక్కువా కాదు...
ఎవరి అర్హతకు అణుగుణముగా వారిని ఆ మార్గంలో నిలుపుతాడు...
ఎవరిని ఆరాధించిన, ఏ మార్గాన్ని అనుసరించిన చివరికి అనంత హృదయవాసంలో అణగవలసిందే.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, April 13, 2023

శివోహం

శివా!నీ అడుగులకు నే మడుగులొత్త
నీవు అడుగు తీసి అడుగు వేయగలేవే
మరి నా కోరిక తీరేది ఎలా....?
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...