Wednesday, June 7, 2023

శివోహం

గౌరీ దేవి శక్తి స్వరూపము అయితే...
శివుడు చైతన్యం...
శక్తి ఉంటే చైతన్యం ఉంటుంది,ప్రాణం ఉంటే శక్తి అంటే శివం ,లేకుంటే శవం...
అందుకే శక్తి స్వరూపిణి  దేవి కృప కోసం ,ఆమె ప్రసాదంగా అనుగ్రహించే  భిక్ష కోసం , ఆమె వద్దకు భిక్షాం దేహి అంటూ అర్థించాడు శివుడు ,
అన్నపూర్ణా దేవి ఇచ్చే భిక్ష వలన శివునికి శక్తి వస్తుంది ,దానితో చైతన్యం ,దానితో భక్తి జ్ఞాన వైరాగ్యం కలుగుతాయి...
ఆహారం  భిక్ష గా గ్రహించడం వల్ల పొందే   ప్రాణ శక్తి తో మానవుడు అద్భుతాలు సృష్టిస్తూ దైవానికి చేరువ అవుతున్నాడు
ఇదంతా భిక్ష మహిమా
ఇచ్చేవాడు ,శివార్పణం అని భావిస్తూ  భిక్షను ఇస్తే,
గ్రహించే వాడు  పరాత్పరుని ప్రసాదంగా  స్వీకరిస్తూ ఉంటే ,ఆ పరమాత్మ ఆ ఇరువురికీ తన కృప ను అందజేస్తూ ఉంటాడు , అనగా దాత గ్రహీత ఇద్దరూ శివ స్వరూపాలే.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా ! అనంతమైన నీ ప్రేమకు 
ఆ మూగ జీవులే సాక్షి కదా 
అంతం లేని ఈ పుట్టు గిట్టుటలకు 
అంతే లేని నీ దయే రక్ష కదా !
శివా ! నీ దయ

Tuesday, June 6, 2023

శివోహం

శీల వైభవము చేత
శివ గుణగాన నైపుణ్యము చేత
శివ మాహాత్మ్యం తెలియుట చేత
శైవక్షేత్ర సందర్శనము చేత
శివభక్త సాంగత్యము చేత
"శివోహం" భావన చేత
జన్మధన్యము కావింపబడును.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

నీ వంశీ నాదమూ...
నీ మోహన రూపమూ...
నీ మధుర నామమూ...
నిరతము నా మదిలోనే...
ఇదే నా భాగ్యము కృష్ణా....
హరి నీవే శరణు.

జై శ్రీకృష్ణ పరమాత్మ నే నమః
ఓం నమో వెంకటేశయా
ఓం నమో నారాయణ.
ఓం శివోహం సర్వం శివమయం.

శివోహం

శివా!శుభాలకు నెలవు
అశుభం ఎరుగని కొలువు
నీ వాసమే అది కైలాసమే
మహేశా . . . . . శరణు .

శివోహం

అనంత విశ్వమంతయు నీవు కదా తండ్రి...
గుళ్ళు గోపురాలు నీకెందుకయ్యా...
అసురుని పొట్టలోన ఉంటావంట కదా...
నా గుప్పెడు గుండెలోన ఉండిపోవా శివ...

మహాదేవా శంభో శరణు.

Monday, June 5, 2023

శివోహం

శివుడా...
భవుడా...
శాంభవుడా...
విభూది ప్రియుడా...
త్రిశూలధరుడా...
అనంతుడా...
గిరి సంచరుడా...
శివ మహాదేవా శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...