Wednesday, June 14, 2023

శివోహం

శివ...
నా అజ్ఞానం కాకపోతే నాలోనే  పరంజ్యోతి రూపంలో ఉన్న నిన్ను ఈ మానవ నేత్రాలతో ఎలా చూడగల ను  చెప్పు...
నిన్నునేను  చూడగలనా తండ్రి...
అల్ప జీవుడైన నేనెక్కడ...
సచ్చిదానంద విశ్వాధారుడవై విశ్వ సృష్టి స్థితి లయతో జగతిని ప్రకాశింప జేసే   ఘనుడవు నీవెక్కడ...
నా జీవన జ్యోతి రూపంలో నా బుద్దిని  ప్రచోదనం చేస్తూ నా భావ సంపదకు నా ప్రాణాలు నిలబడటానికి ఆధారమైన పరమాత్మ నీవు...
మహాదేవా శంభో శరణు.

Tuesday, June 13, 2023

అయ్యప్ప శరణు

మణికంఠ....
నా ఈ దేహంలో ని  వేలాది  నాడులు...
నీ నామ  రూప దివ్యగానం చేస్తూ...
పాల పొంగులా   పొరలే అనందాన్ని నా ఎదలో  ఉవ్వెత్తున ఉప్పొంగుతుంది...
నీ దివ్య నామాన్ని నోరారా  స్తుతిస్తూ  ,తన్మయం పొందే పరమ సౌఖ్యాన్ని ఈ నా నాలుకకు  అందించవా...
హరహర పుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

నిన్న ను మరిపిస్తావు...
నేటి నుంచి మురిపిస్తావు...
రేపటి రోజును గుర్తు చేస్తావు...
మూడు నామాల వాడవు...
నిన్న నేడు రేపుల నాధుడవు...
లోకాల నేలుతూ నన్ను కాచేవాడవు నీవే కదా
పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు.

Monday, June 12, 2023

శివోహం

శంభో...
నిన్ను తలచ మది ఎంతో  పులకరించు
నిన్ను కొలువ జన్మ మింక ధన్య మౌనుగా
శివ నీవే మా ఇల వేల్పువు...
కనికరించి కృప జూడ జాగేల తండ్రి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!తెలిసిన మౌనం తెరతీసింది
మనసైన మౌనం ముందుకొచ్చింది
మాటను గ్రహించు నన్ను అనుగ్రహించు
మహేశా . . . . . శరణు .

శివోహం

నిజం కాని మా బ్రతుకుని నిజమని భ్రమింప జేస్తావు..
ఆ భ్రమ లో ఓపిక ఉన్నంతకాలం తాపత్రయాల మధ్య ఊగిసలాటే ఈ జీవితం...
తీరా కనులు తెరిసాకా గడిచిన కాలం ఓపిక లేని శరీరం మాత్రమే మిగిలేది..

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నీ చూపు పడనిదే బండరాయి వంటి నా హృదయం లో భక్తి అనే మొలక చివురించదు కదా శివ...
ఒక రైతు నీలాకాశం వైపు తన చేల పై చల్లని నీరు కురిపించే నల్లని నీటి మబ్బు కోసం  ఆశగా ఎదురు  చూస్తూ...
తన బ్రతుకు నంతా తాను చూసే  తన కంటి చూపులో  నింపుకుని ఉంటాడో  అలా
నేను నీకోసం పడిగాపులు కాస్తూ నీ అనుగ్రహ వర్షాధార లో మనసారా తనివారా కరువు దీరా  తడవాల ని ఉంది తండ్రి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...