Tuesday, July 4, 2023

శివోహం

శివా!గావుకేక పెట్టాను చిత్తాన నేను
కష్టాలు వెలివేయ కదలి వస్తావని
మీసాలు మెలివేసి ముందుకొస్తావని
మహేశా . . . . . శరణు .

శివోహం

కర్మఫలితాలు ఆ  భగవంతుని అమృత హస్తాల నుండి మనకు  ప్రసాదంగా వస్తూ ఉంటుంది...
కష్టం వస్తే 
ఎందుకు జరిగింది...
నాకే ఎందుకు జరిగింది...
ఇప్పుడే ఎందుకు జరిగింది...
అదే కష్టం తిరిపోతే
నాకే జరగ వలసి వుంది కనుక జరిగింది...
ఇది నాకే జరగాలి...
అవును ఇప్పుడే జరగాలి....
అని అనుకోకు పరమేశ్వరుడు ఇదంతా చూస్తూ , చేయిస్తూ ,తగిన ఫలితాలను ప్రసాదంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు...
దుఃఖం లో నైనా సంతోషం లో ఎప్పుడు దైవం తోనే ఉండు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, July 3, 2023

శివోహం

మానవత్వం నీలో ఉంటే ఏ గుళ్ళు గోపురాలు వెళ్లానవసరం లేదు...
దేవుడే నీ కోసం వెతుక్కుంటు వస్తాడు...

ఓం నమః శివాయ.

శివోహం

పసిడి వయసులో నీ గుడి అరుగులమీద
గడిపిన నాజీవనయాత్రను నీ గుడి
అరుగులపై ఒదిగే
భాగ్యాన్ని కలిగించు
బ్రతుకుపోరాటంలో నిన్ను మరచిపోకుండా
గొడుగువై నీడవై నన్ను కాపాడు శివా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!మాట ముందుకు కదిలి
మౌనం చేస్తోంది ఓ మజలి
మాట ఆగనీ మజిలీ మారనీ
మహేశా . . . . . శరణు .

Sunday, July 2, 2023

శివోహం

తాత్కాలిక సౌఖ్యాన్ని వస్తుసముధాయం తో పొందే సంతోషాన్ని *అనందం* అనుకుంటే..

అదే అనందం, పరమాత్ముని తో ముడి వేస్తే  మనకు కలిగేది *బ్రహ్మానందం*...

ఓం నమః శివాయ.

శివోహం

అనందం అంటే పరమాత్మ తో భక్తుడు ఏర్పరచుకునే  మధురాతి మధురమైన ప్రేమానుబంధం...
అంటే దైవాన్ని త్రికరణ శుద్ధితో భావిస్తూ సేవించడం... నిత్యం పూజించడం...
భక్తితో రచనలు చేయడం...
భక్తితో స్తుతించడం...
కీర్తనలు ఆనందంగా గానం చేస్తూ ఉండడం...
స్వామిని మనసారా, తనివితీరా చేతులారా సేవించడం...
అదే భగవన్నామ స్మరణంతో జీవిస్తూ ఉండడం.
ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...