Tuesday, August 15, 2023

శివోహం

శంభో...
అనుభవం నేర్పిన విజ్ఞానం తో భావములోనా, బాహ్యమునందున నిన్నే దర్శించుకుంటున్నా...
నీవే తప్ప నాకు వేరే దారి లేదు తండ్రీ...
నా చిత్తశుద్ధిని ,నిశ్చలతత్వం ను అనుగ్రహించూ పరమేశ్వర...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నిష్టూరాలు నీలి మబ్బులు
కష్టాలు కడలి కెరటాలు
కూలి కరగిపోవు నీ కంటి చూపుతో
మహేశా . . . . . శరణు .

శివోహం

మానవ పుర్రె ఓక కోరికల గంప దీని నింప గలవారు ఈ భూమి మీద లెడు...
ఈ కోరిక తీరింది అనుకోవడమే కొత్త కోరిక కు పునాది....
కోరికలకు అది లేదు అంతం అంత కన్నా లేదు...
కాబట్టి కోరిక దుఃఖం కు మూలం...
ఎన్ని కొరికలో అంతే దుఃఖం...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, August 14, 2023

శివోహం

ఎన్ని కష్టాలు రానీ...
సుఖాలు పోనీ...
నిన్ను తలిచి, కొలిచి పూజించి భజించి భావించే అచంచలమైన భక్తివిశ్వాసాలను అనుగ్రహించు తండ్రి...
భావ దారిద్ర్యం రానీకు హర...
నీ తలంపు లేని ఘడియలు కష్టం, కావున మహిమాన్వితమైన నీ దివ్యవిగ్రహ దర్శన మహాభాగ్యాన్ని ప్రసాదించు...
మా కున్న కష్టాలలో కూడా నీ ఉనికిని గుర్తించే స్పూర్తిని శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించు...
మహాదేవ దేవా శరణు...
శరణు జగదీశా శరణు...
ఆదిదేవా శరణు.

Saturday, August 12, 2023

శివోహం

జీవితంలో కలిగే దుఖఃము లకు పరమాత్మ కారణమని భావిస్తూ కొందరు దైవాన్ని దూషిస్తూ ,ఆరాధనా, సేవ పూజల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు...
కష్టాలు కలిగేవి తన పూర్వజన్మ ఫలం వలననే గానీ  అది ,,దేవుడు కక్షతో ఇచ్చే శిక్ష కాదు...
సుఖాన్ని ఎంత సంతోషంగా  స్వీకరిస్తూ అనందిస్తూ ఉంటావో ,అలాగే కష్టాలను కూడా గతంలో చేసిన ఆపరాధాలకు ఫలితంగా అంగీకరిస్తూ ,కష్టాలను స్వాగతించాలి...
శని ప్రభావం, రాహు కేతు దోషాలనుండి గ్రహ దోష పూజలను చేస్తూ తప్పించుకోవచ్చు నేమో గానీ ,కర్మఫలాల ను ఎవరూ తప్పించుకోలేరు.!. ఎంతటివారైనా చేసిన కర్మలు  అనుభవించక తప్పదు...
ఒక్క దైవం తప్ప కర్మానుభవాన్ని తగ్గించగల శక్తి మరే విధంగా కూడా వీలు కాదు...
అందుకోసం నిష్కల్మషమైన ప్రేమతో ఇష్టదైవాన్ని పూజిస్తూ ,జీవితంలో ఆనందాల వెలుగులను నింపుకుందాం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

తండ్రీ

నా అవివేకం
ఎంత గొప్పదో కదా 
ఇంతటి రక్షణ ఒదిలి
రక రకాల
ఉపాధుల యందు చరిస్తూ
ఎంతలా
ఆందోళన పొందుతున్నానో

నా జ్ఞానం
ఎంత గొప్ప అజ్ఞానమో
చూడు
అమృత తుల్యమైన
నీ వాత్సల్యం విడిచి
సాటి ఉపాధుల
ఆదరణకై వెంపర్లాడు తున్నాను

నా మూర్ఖత్వం
ఎంత ఉన్నతమో
చూడు
ఆర్తి తో జనించిన
కన్నీటికి పొంగిపోయే నిన్ను
ఎలా పొందలో తెలియక
నానా రకాలుగా
యాష్ట పడుతున్నాను 

ఆ క్షణం మళ్ళీ నాకు ప్రసాదించు
అవివేకాన్ని తొలగించు
పశుపతీ

మూర్ఖులైన బిడ్డలను కూడా
అక్కున చేర్చుకునే తండ్రివి నీవే

శివయ్యా నీవే దిక్కయ్యా

శివోహం

శివా!అర్థనారీశుడవై అటుఇటు తిరిగినా
ఏక రూపముననే ఎద్ధునెక్కి వస్తావు
గుప్తంగా గుండె గూటికి జ్యోతిగానే చేరేవు
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...