Friday, January 5, 2024

శివోహం

ఆ నలుగురిని సంపాదించాలని అనుకోగానే...
నితో బంధం బలపడింది.

శివ నీ దయ.

శివోహం

శివా!నీ తల చుట్టూ తిరిగినా
నీ తల వాకిట నిలిచినా
నీ తరుణిగ తెలియలేదు నిక్కముగా
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ..
ఎన్ని జన్మలు ఇచ్చావు నిన్ను తెలుసుకునేందుకు...
కాలం కరిగిపోతోంది ఏళ్ళు గడిచి పోయినాయి అహం నన్ను వదలటంలేదు తండ్రి...
అహంకార నిర్మూలనకు అనేకజన్మల ఇచ్చే ఉంటావు మళ్లీ ఈ జన్మలైనా సద్వినియోగం చేసుకునేలా నీ భక్తి ఈ జన్మకు కలిగింది...
జన్మ పరంపరలు దహిస్తావు  కదా నీవు...
అహాన్ని ఆమడ దూరం పెట్టి  మనసు నీ పాదాల చెంత ఉంచి నువ్వే సర్వం అనే నమ్మిన భక్తునికి జ్ఞానాగ్ని ని అందించు తండ్రి.
మహాదేవా శంభో శరణు.

Thursday, January 4, 2024

శివోహం

ఏడేడు భువనాలు ఏలేటి దొరవు నీవు...
నీకెందరో ప్రియ భక్తులు...
నాకు మాత్రం నీఒక్కడివే...
నీవు వచ్చే వరకు పిలుస్తూనే ఉంటా...
తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్సులు.

శివోహం

శివ యని నోరు నొప్పి పుట్టేలా పలుకుతున్న..
నీ పిలుపు నాదమై వినిపించేలా
ఎదలో లయ ఆనందమై తుళ్ళిపడేలా ఒక్క పలుకు పలుకు హర.

శివ నీ దయ.

శివోహం

శివా!వెలుగుల వరమైన చంద్రుడు
సోమరసమును పొంది సిగలోకి చేరును
చూడనిమ్ము ఆ సోముని నీ సిగను చేరి
మహేశా . . . . . శరణు .

శివోహం

నాదస్వరం వినిపిస్తే పుట్టలోని పాములన్నీ బయటికి వచ్చినట్లుగా, మీరు నామస్మరణ చేస్తే మీ హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి. నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవడం చేతనే దేశంలో బాధలు పెరిగిపోతున్నాయి. వీధివీధి యందు నామ సంకీర్తన చేయండి. శరీరంలోని అణువణువునూ, కణకణమునూ భగవన్నామంతో నింపుకోండి. నామస్మరణ వలన కలిగే ఆనందము, ధైర్యసాహసాలు ఇంక దేనివల్లనూ లభించవు. ఇతరులేమనుకున్నా ఫరవాలేదు, అపహాస్యం చేసినా పట్టించుకోనక్కర్లేదు. దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మీరు అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. మీ మనస్సే ఒక వీణ. అందులో చెడ్డభావాలనే ‘అపస్వరాలు' రాకుండా చూసుకోండి. మనస్సనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ మీ జీవితాన్ని గడపండి. అప్పుడే మీకు భగవదనుగ్రహప్రాప్తి కలుగుతుంది.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...