Wednesday, March 27, 2024

ఓం నమో నారాయణ

ఒక్కొక్కసారి భగవంతుడే మన స్థిరచిత్తాన్ని పరీక్షించడానికి, పవిత్రకరించడానికి బాధలు కల్గిస్తాడు. అందుకే, సాధకుడు బాధల మధ్య చెదిరిపోకూడదు. మనల్ని మలిచేందుకు వచ్చినవే ఇవన్నీ అని భావిస్తూ, బాధలను దూరం చేయమని పరమాత్మను ప్రార్ధించక, బాధలను తట్టుకునే శక్తినివ్వమని పరితపించాలి.  బంగారు నగ శోభాయమానంగా తయారయ్యేముందు నిప్పుల్లో ఎంతగా కాలిందో, సమ్మెటపోట్లను ఎంతగా భరించినదో కదా. రోకలిపోటులకు ముక్కలుగాని బియ్యమే భగవదారాధనకు ఉపయోగపడే అక్షింతలైనట్లు, జీవితంలో దెబ్బల్లాంటి బాధలు తట్టుకొని విరగని చెదరని చిత్తదారులే భగవత్ప్రాప్తికి పాత్రులౌదురు

Tuesday, March 26, 2024

శివోహం

వర్ణనకు అతీతం...
వర్ణాలకు అతీతం...
లక్ష్యాలకు అతీతం...
లక్షణాలకు అతీతం...
విలక్షణమే నీవు విశ్వేశ్వరా..
పాహి పరమేశ్వరా పాహి.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!అంతటా అని వినిపిస్తున్నా కొంతగా కనిపిస్తున్నా
నిన్నుగన నేను శోధిస్తున్నా  సాధనలో శ్రమిస్తున్నా
గమనమే గడుస్తోంది,గమ్యం ఏనాటికో..
మహేశా . . . . . శరణు . 

శివ నీ దయ

శివోహం

శివా!అంతటా అని వినిపిస్తున్నా కొంతగా కనిపిస్తున్నా
నిన్నుగన నేను శోధిస్తున్నా  సాధనలో శ్రమిస్తున్నా
గమనమే గడుస్తోంది,గమ్యం ఏనాటికో..
మహేశా . . . . . శరణు . 

శివోహం

శివ
నీవు బైరాగి వైనా ...
లయ కారకుడివే .....
ఆ రాజసం ఆ దర్పం నీకు కాక మరెవరికి ఉంటుంది తండ్రీ...
ఎన్ని సార్లు చూసిన ఉన్నా తనివి తీరదు...
కాస్త దగ్గరగా ఓ నిమిషం నిను చూసే భాగ్యం కలిగించు...
నిను చూసే లోపు ఆలోచనలు అడ్డు వచ్చి మనసును దారి తప్పించి నిన్నారాధించే అదృష్టం కలిగించు సర్వేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

Monday, March 25, 2024

శివోహం

స్మరణ జొచ్చుట నావంతు కర్మను తీర్చుట నీవంతు...
పూలతొ పూజించి మోక్కులు తీర్చుట నావంతు...
శాంతిని ఇచ్చుట నీవంతు...
కోరిక చెప్పుట  నావంతు మాటను నిల్పుట నీవంతు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...