Friday, April 19, 2024

శివోహం

శివా!చిన్నప్పుడు నిన్ను జేజన్నాను
కొంత పెరిగాక  నిన్నే శివుడన్నాను
నేడు తెలిసాక నీవే నేనంటున్నాను
మహేశా . . . . . శరణు .

Thursday, April 18, 2024

శివోహం

శివ,
నీ పాదకుసుమవ్వాలనే కామాన్ని కలగనివ్వు...
నిన్ను చేరక పలుతావుల తిరిగే మనసు పై క్రోధాన్ని పెరగనివ్వు...
నిరంతరం నిన్ను నా కనులారా చూడాలనే మోహాన్ని నిలువనివ్వు...
నీవు నా స్వామివనే లోభాన్ని వుండనివ్వు...
నా ఆర్తిని వేడుక తో చూసే నీపై నన్ను నీ దరికి చేర్చుకోలేద నే మదమాత్సర్యాన్నీ కలగనివ్వు నువ్వు  కల్పించిన 
ఈ అరివర్గ పాశాలను నీ దరికి చేర్చే  ప్రణవమార్గాలుగా మారనివ్వు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ!
ఎన్నిసార్లు మీ ముందర మోకరిల్లినా...
ఇచ్చిన ఋణం తీరిపోవునా...
ఎన్నిసార్లు చక్కని పూలతో అలంకరణ చేసినా...
చల్లని మీ చూపుల స్పర్శకు సాటిరాగలదా...
విధిగా ఆలయ పరిసరాలు శుభ్రం చేసినా మీ సన్నిధిలో పొందిన మనశ్శాంతి మరెక్కడైనా దొరుకునా
ఏది చేసిన,  ఏమి ఇచ్చినా అవన్నీ నీవు ఇచ్చిన భిక్షయే కదా హర...

మహాదేవా శంభో శరణు.

Wednesday, April 17, 2024

శివోహం

ఏ ప్రాణులు తమ మనస్సు,బుద్ధి,
అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో,
ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి
పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో,
వారు అన్ని కర్మల నుండి
విముక్తులై మోక్షాన్ని పొందుతారు.

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం
ఓం పరమాత్మనే నమః

శివోహం

భోగం అంటే పరమాత్మ సన్నిధి…
భాగ్యం అంటే శాంతి...
భోగభాగ్యాలు అంటే పరమాత్మ సన్నిధి లో లభించే శాంతి.

ఓం నమః శివాయ
ఓం శివోహం సర్వం శివమయం.
ఓం పరమాత్మనే నమః

శివోహం

శివా!నీ స్మరణకొక రూపాన్ని కల్పించినావు
అవనిలో రామునిగ ఎరుగ జేసావు
ఆ  రామమే తారక మంత్రమై వెలుగ జేసావు
మహేశా . . . . . శరణు .

Tuesday, April 16, 2024

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామచంద్రుడు 
ఒక మానవోత్తముడు   
సోదర ప్రేమకు నిదర్శనం
తండ్రి మాట జవదాటనివాడు 
ప్రజల మాటకి విలువనిచ్చే వాడు సీతమ్మ తల్లిని అపురూపంగా చూసుకొని 
సీతారాముడు ఒక్కరే అని చాటి చెప్పిన సీతారాముడు... 
ఆ వైకుంఠ రాముడు శ్రీరామచంద్రుడు గా
ఈ భూలోకంలో జన్మించి
ఒక మానవుడు ఎలా ఉండాలి  రాజ్యపాలన ఎలా చేయాలి...
దుష్టులకు  ఎలాంటి శిక్ష వేయాలి అని...
తాను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి
మన మానవులు  ఆదర్శవంతులు గా ఉండాలని
తాను మానవుడిగాజన్మించి 
మనకు ఆదర్శప్రాయం గా ఉన్న   శ్రీరామచంద్రుని కరుణాకటాక్షాలు మనందరిపై వుండాలని కోరుకుంటు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...