Tuesday, May 7, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అడగవేంటి స్వామి...
ఏమయింది అని...
అన్ని తీరుస్తుంటే అవసరమేముంది లే కానీ...
పిలువ వేంటి స్వామి...
బాధ పెట్టి కర్మలు తీర్చు వాడవు నీవే కదా మరి రావేంటి తండ్రి మా ఇంటికి సేవలందుకొనుటకు...
మనసున పీఠమేసినావు ఇంకేమి కావాలి హర...
నా బతుకు లోకి తొంగి చూడవేంటి తండ్రి ఇంకా ఎన్ని సుడిగుండాలన్ని దాటలో.

మహాదేవా శంభో శరణు.

Monday, May 6, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
తప్పించు కోలేని తరుణంలో
తప్పులు తెలిసి, తెలియక, చేసితిని 
తప్పు  చేసినట్లు విన్నవించు చున్న 
తప్పు  క్షమించి  మము కాపాడు సదాశివ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
వేదనే జీవితమై...
రేయి పగలు గడుస్తొంది...
రోదనే జీవనమై...
బ్రతుకు బాట సాగుతుంది...
కంటి వెలుగుకు మంటలు పెడుతూ…
దారులన్నీ చీకటి చేస్తూ...
కంట నీరుకి ఆవిరి పెడుతూ…
దారలన్ని జలధారలు చేస్తూ...
స్థిరమైన జగతిలో...
అస్థిరమైన తోడు తో
మతి ,గతి లేని మనసుతో
వేదనే జీవితమై రేయి పగలు గడుస్తున్న నా జీవితం ను
ఓ కంట కనిపెట్టు ఉంచు.
మహాదేవా శంభో శరణు.

Sunday, May 5, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఆశలు అడియాశలై ఊహలు తలకిందులై...
సమస్యలు ఒక్కసారిగ ఉప్పెనై ముంచెత్తగ...
జీవన సంద్రాన నిరంతరంగా ఎదురీదుతూ...
జీవశ్చవమై బతుకీడుస్తున్న ఈదీనుడిని...
ఆత్మవిశ్వాసానివై వెన్నుతట్టి ధైర్యాన్నిస్తూ...
పరోపకారివై జీవించమని దారిచూపుతూ...
ఆత్మ సంతృప్తిని కలిగించిన ఓ నాదైవమా..
మహాదేవా శంభో శరణు.

శివోహం

వెలుగు నీడల్లో వెలుగును కోరుకున్నందుకేమో..
చీకటి వెలుగుల్లో చిక్కింది నా మది.

శివ నీ దయ!

Saturday, May 4, 2024

అయ్యప్ప

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరిహారపుత్ర అయ్యప్ప!
ప్రతిరోజు ఒక్కో కష్టం నాకు తలపెట్టి...
నన్ను నాకే పరిచయం అయ్యేలా చేశావు...
అంతం అయిందన్న నా జీవితంలో నీవు తప్పక
నాతో ఉన్నావు అని తెలుస్తుంది...
నిన్ను తలుచుకున్న  ప్రతీసారీ మొదలవుతుంది నా జీవితం నిత్య నూతనంగా

మణికంఠ నాకు నీవే దిక్కయ్యా.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

ఓం గం గణపతియే నమః

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
గణాధిప నమస్తే
ఉమాపుత్రాయ నమస్తే
శివపుత్రాయనమస్తే
విఘ్నరాజాయ నమస్తే
ఏకదంతాయ నమస్తే
మూషిక వాహన నమస్తే
కుమారగురవే నమస్తే
వక్రతుండాయ నమస్తే
సిద్ధి వినాయక నమస్తే
బుద్ధి వినాయక నమస్తే
లాభ వినాయక నమస్తే
క్షేమ వినాయక నమస్తే

ఓం గం గణపతియే నమః.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...