Thursday, May 30, 2024

శివోహం

శివా!కనరాని రూపానికి అనువైన నామాలు
శ్రమలేని రీతిలో నాకు ఎరిగించినావు
స్మరణగా శాస్వతో జత చేసినావు
మహేశా . . . . . శరణు .

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!!
మానవ జన్మంటే మహిమాన్వితము కాదని...
దుఃఖ సాగరం ఈదేటి జీవన నౌకని  తెలిసింది...
మాయ మర్మము లలో మునిగిన  మెదడు కి మోహమే  సింహాసనం కామమే  సుఖాసనం తెలిసింది..
సుఖదుఃఖలను తప్పించి నీ సన్నిధికి దారి చూపు నా తండ్రి...
దయ చూపు నా స్వామి...
దయ చేయు నా తండ్రి.
మహాదేవా శంభో శరణు.

Wednesday, May 29, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


దైవమును నీకోసం క్రిందికి రమ్మనకు
నీవే పైకి ఎదగాలని గ్రహించు
నీ పాత్ర స్వభావాన్ని దైవానికి అనువర్తించకు
నీ మెదడు స్థితిని పరిపక్వత చెందించమని ప్రార్థించు          
క్రోధాన్ని,వేదనని సంకుచిత తత్వాన్ని
విడువుము వాటిని నిశ్వాసము మాదిరి
ఓర్పునూ శాంతినీ సుదృఢ చిత్తాన్నిఎగపీల్చుము
అవియే ఉచ్ఛ్వాస విభావరి
నీలో వున్న చైతన్య శక్తిని
దీపించే లక్షణాలు పెంపొందిస్తే 
మధురానందం నీకు లభ్యమవదా
దైవం ఎల్లపుడూ నీకు రక్ష కాదా.

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శరీరం అలసిపోతే మరణం...
మనసు అలసిపోతే లయం...
అదే జీవన్ముక్తి నిలయం...
వినీల గ్రహణం , విశుద్ధ సత్వం...
భౌతిక యంత్రం ఆగిపోతే....
చింతన,యాతన...
అదే మనో తంత్రం ఆగిపోతే...
దుఃఖ నిర్మూలన...
చిదానంద ధారణ...
శోక నివారణ...
పునరావృత హరణ.

ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, May 28, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా అంతరాత్మ ప్రభోధంగా..
నీ చెంత చేరియున్నాను...
నీవే నాకు దిక్కు....
సర్వ త్వజించి నీకు పూజలు చేయలేను...
కర్మానుసారముగా నడుస్తూ నా మదిలోని 
తలపులను, కష్టాలను తెలుపు కుంటున్నాను  
కనుపాపగా నీవే నా చెంత ఉండి
నా గమ్యం ఏమిటో తెలియపరుచు.

మహాదేవా శంభో శరణు.

హరిహర

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
గడ్డు కాలం...
కాన రాని గమ్యం...
మహాదుఖం తో వస్తున్న
కంటి తడిని తుడిచేసినా
గాలి తిత్తుల తడి ఆరక
గుండె తల్లడిల్లి పోతుంది
నిన్ను చేరుకోవాలనే కోరిక కాబోలు పరమేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...