Wednesday, May 29, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


దైవమును నీకోసం క్రిందికి రమ్మనకు
నీవే పైకి ఎదగాలని గ్రహించు
నీ పాత్ర స్వభావాన్ని దైవానికి అనువర్తించకు
నీ మెదడు స్థితిని పరిపక్వత చెందించమని ప్రార్థించు          
క్రోధాన్ని,వేదనని సంకుచిత తత్వాన్ని
విడువుము వాటిని నిశ్వాసము మాదిరి
ఓర్పునూ శాంతినీ సుదృఢ చిత్తాన్నిఎగపీల్చుము
అవియే ఉచ్ఛ్వాస విభావరి
నీలో వున్న చైతన్య శక్తిని
దీపించే లక్షణాలు పెంపొందిస్తే 
మధురానందం నీకు లభ్యమవదా
దైవం ఎల్లపుడూ నీకు రక్ష కాదా.

ఓం శివోహం...సర్వం శివమయం.

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...