Thursday, October 10, 2024

 నా పదాలు ఎవరికైనా గుచ్చుకుంటే

గుచ్చుకోనియి!
మధువు పేరుతో విషాన్ని అందించడం
నాకు చేతకాదు!

 నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఏమిటి?!"

ద్రోహం చేసే ముందు అందరూ అడిగే ప్రశ్న ఇదే!

 నువ్వు నన్ను శత్రువుగా భావిస్తే నాకు కూడ ఆనందమే! అంతా మన మంచికే అనుకుంటా!

అసంఖ్యాకులైన నీ శత్రువులు నాకు
మిత్రులవుతున్నారు నేడు! అది చాలు!

ఓం శివాయ

 తికి ఉన్నన్నాళ్ళు పచ్చిగా

కాలిన జీవుడు, పోయాక
లోనున్న పాపాల తడి తగలడి
మేను మానులు కలిసి
పరమేశుని సన్నిధిలో
పునీతమై సువాసనల
సుగంధమై శివుని నుదుట
విభూదిగా మారడం విశేషమే
ఛీ ఛీ అనుకోకపోతే భువిపై
పాతుకుపోయి జనానికి
బరువవుతావని ఆ ఛీదరింపు
ఎన్ని జన్మలెత్తినా అర్థం
చేసుకోకపోతే ఎలా
మానవా! ఇది నిరంతర
ప్రక్రియ,. పరమేశుని దయ
ఓం శివాయ నమః శివాయ

శివోహం.

 భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు

చిత్తములో వెతకండి...
భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు...
కానీ మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన మనకి కానరాడు...
మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు...
మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు...
మొదటిది అహంకారం, రెండవది మమకారం...
ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు....
జై శ్రీమన్నారాయణ
ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, October 2, 2024

అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరిహర పుత్ర అయ్యప్ప

నా నడకలో నీ నామమొకటే తోడుగా ఉండేది.

నిన్ను చేరే దారిలో భయమేమి కలగకుండా నీవే ధైర్యం కల్గించాలి

మణికంఠ శరణు.

Tuesday, October 1, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఉరుకుల పరుగుల జీవితం...
ఆగితే దొక్కడదు...
ప్రాపంచిక బంధాల మాయలో పడి నిన్ను మరిచాను....
క్షణిక సుఖమే శాశ్వతమని తలచి నిన్ను మరిచాను.  
అనుభవాలు ఎన్ని ఎదురైనా....
ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి....
వ్యామోహములో పడి చింతిస్తున్న....
తెలిసి తెలియక నిన్ను మరచిన
కాలాన్ని తొలగించు..
నిన్ను తలచిన క్షణాలనే గుర్తించి
ఆదరించు.

శివ నీ దయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...