Thursday, October 10, 2024

ఏ బంధము
కాలం గడిచినా
తరగక పెరుగుతుందో
ఏ బంధము
పంతాలు పట్టింపులకు
పోక నిలబడుతుందో
ఏ బంధము
అహము స్వార్ధము
సోకక ప్రభావిస్తుందో
ఏ బంధము
నీ నా అని బేధము
ఎరుగక భాసిల్లుతుందో
అలాంటి బంధాలు
శాశ్వతము
ఈ జన్మకే కాదు
జన్మ జన్మలకు
ప్రతి బంధము
మొక్క లాంటిదే మొదట్లో
కానీ పెంచుకున్న కొద్దీ
వట వృక్షమై
తమకే కాదు తమ చుట్టూ
ఉన్నవారికి కూడా
ఆనందపు అమృతాల ఫలాలు
అందిస్తుంది ...

 శివప్పా

ఒకే
ఒక్క లక్ష్యం ...
తల్లి
గర్భగుడి నుండి ...
తండ్రి
గుండెగుడికి చేరుకోవడం ...
శివోహం శివోహం

శివా

 శివా!ఊపిరి పోసి ఉసిగొల్పడం

ఆశలు చూపి ఆడించడం
ఎన్నాళిలా ఇంక చాలయ్యా
మహేశా . . . . . శరణు.


 నా పదాలు ఎవరికైనా గుచ్చుకుంటే

గుచ్చుకోనియి!
మధువు పేరుతో విషాన్ని అందించడం
నాకు చేతకాదు!

 నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఏమిటి?!"

ద్రోహం చేసే ముందు అందరూ అడిగే ప్రశ్న ఇదే!

 నువ్వు నన్ను శత్రువుగా భావిస్తే నాకు కూడ ఆనందమే! అంతా మన మంచికే అనుకుంటా!

అసంఖ్యాకులైన నీ శత్రువులు నాకు
మిత్రులవుతున్నారు నేడు! అది చాలు!

ఓం శివాయ

 తికి ఉన్నన్నాళ్ళు పచ్చిగా

కాలిన జీవుడు, పోయాక
లోనున్న పాపాల తడి తగలడి
మేను మానులు కలిసి
పరమేశుని సన్నిధిలో
పునీతమై సువాసనల
సుగంధమై శివుని నుదుట
విభూదిగా మారడం విశేషమే
ఛీ ఛీ అనుకోకపోతే భువిపై
పాతుకుపోయి జనానికి
బరువవుతావని ఆ ఛీదరింపు
ఎన్ని జన్మలెత్తినా అర్థం
చేసుకోకపోతే ఎలా
మానవా! ఇది నిరంతర
ప్రక్రియ,. పరమేశుని దయ
ఓం శివాయ నమః శివాయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...